బహిరంగ విచారణ నుండి అందుకే తప్పుకుందా?

Published : Jun 13, 2017, 07:43 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
బహిరంగ విచారణ నుండి అందుకే తప్పుకుందా?

సారాంశం

బహిరంగ విచారణ అంటే ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు ఎదురౌతాయి. విచారణ మొదలైతే పచ్చనేతల బాధితులు చేసే ఫిర్యాదులతో ప్రభుత్వం ఇరుకునపడటం ఖాయం. తమ భూములను సొంతం చేసుకున్న పచ్చ నేతల చిట్టాను బాధితులను బాహాటంగానే వివరిస్తారు. దాంతో ప్రభుత్వానికి ఇబ్బందులు మొదలవుతాయి. దానికితోడు బాధితుల తరపున ఎటూ వైసీపీ లీడ్ తీసుకుంటుంది.

విశాఖపట్నం జిల్లాలో బయటపడిన భూ కుంభకోణం విచారణలో ప్రభుత్వం ఎందుకు రివర్స్ గేర్ వేసింది? ఇన్నిరోజులు కుంభకోణంపై ఈ నెల 15న బహిరంగ విచారణ జరిపిస్తామని చెప్పిన ప్రభుత్వం హటాత్తుగా ప్రత్యేక విచారణ బృందం (సిట్)తో విచారణ జరిపించాలని నిర్ణయించింది. దాంతో అనుమానాలు మొదలయ్యాయి. జిల్లాలో భారీ ఎత్తున భూ కుంభకోణం జరిగిందన్నది వాస్తవం. ఎందుకంటే రెవిన్యు రికార్డులు ట్యాంపరింగ్ జరిగిందని స్వయంగా కలెక్టర్ ప్రవీణ్ కుమారే అంగీకరించారు.

అంతకుముందు నుండే జిల్లాకు చెందిన మంత్రి చింతకాయలఅయ్యన్నపాత్రుడు బాహాటంగానే ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయ్యన్న ఆరోపణలతోనే పార్టీ, ప్రభుత్వంలో కలకలం రేగింది. వైసీపీ ఆరోపణల ప్రకారం మరో మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు మరో ఐదుగురు ఎంఎల్ఏలు భాగస్వాములు. సరే, చోటా మోటా నేతలు ఎలాగూ ఉంటారు కదా?

వైసీపీ ఆరోపణల ప్రకారం వివిధ నియోజకవర్గాల్లో సుమారు రూ. 3 లక్షల కోట్ల విలువైన 12 వేల ఎకరాలను పచ్చ పార్టీ నేతలే సొంతం చేసేసుకున్నారు. ఇంత భారీ కుంభకోణంలో  ఇంత కాలమూ బహిరంగ విచారణ అంటూ వచ్చిన ప్రభుత్వం ఒక్కసారిగా ప్లేటు మార్చటంతోనే అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి.

బహిరంగ విచారణ అంటే ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు ఎదురౌతాయి. విచారణ మొదలైతే పచ్చనేతల బాధితులు చేసే ఫిర్యాదులతో ప్రభుత్వం ఇరుకునపడటం ఖాయం. తమ భూములను సొంతం చేసుకున్న పచ్చ నేతల చిట్టాను బాధితులను బాహాటంగానే వివరిస్తారు. దాంతో ప్రభుత్వానికి ఇబ్బందులు మొదలవుతాయి. దానికితోడు బాధితుల తరపున ఎటూ వైసీపీ లీడ్ తీసుకుంటుంది.

అసలే ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ సమయంలో ప్రజల ముందు బహిరంగ విచారణ అంటే ప్రజల ముందు దోషిగా నిలిచి పరువు పోగొట్టుకోవటమే. అందుకనే రహస్యంగా విచారణ జరిపిస్తే వివరాలు బయటకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అందుకనే బహిరంగ విచారణ స్ధానంలో సిట్ అంటూ కొత్త రాగం అందుకుంది.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే