kolikipudi srinivas: టీడీపీ ఎమ్మెల్యేని పట్టించుకోని సీఎం చంద్రబాబు.. సొంతపార్టీ ఎమ్మెల్యేపై అంత కోపమా?

తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్‌ తన విశ్లేషణలు, పంచ్‌ డైలాగులతో ఫేమస్‌ అయ్యారు. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నిత్యం వివాదాల్లో ఉంటూ టీడీపీ పార్టీకి తలనొప్పిగా మారారు. తాజాగా సీఎం చంద్రబాబును కలిసేందుకు వెళ్లిన కొలికిపూడిని కనీసం ఆయన పట్టించుకోలేదు, పలకరించనూ లేదు. దీంతో కొలికిపూడి చుట్టూ కత్తివేలాడుతోందని స్పష్టంగా తెలుస్తోంది. అసలు కొలికిపూడి ఈ పరిస్థితికి రావాడనికి కారణం ఏంటి? 

Why CM Chandrababu Didn't Greet MLA Kolikipudi Srinivas on Jagjivan Ram Jayanti in telugu tbr

ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్‌ తీరుపై టీడీపీ అధిష్టానంలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. నియోజకవర్గంలో కొలికిపూడి ప్రవర్తిస్తున్న విధానంపై అగ్రనాయకత్వం సీరియస్‌గా ఉంటోంది. తాజాగా ఈరోజు ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో ఏర్పాటు చేసిన బాబు జగజ్జీవన్‌రామ్‌ జయంతి కార్యక్రమంలో పాల్గొంనేందుకు హెలికాఫ్టర్‌లో వచ్చిన సీఎం చంద్రబాబును ఆహ్వానించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే కొలికిపూడికి పట్టించుకోలేదు. సీఎం చంద్రబాబు హెలిప్యాడ్‌ వద్ద నుంచి నడుచుకూంటూ వస్తుండగా.. నాయకులు గులాబీ పూలు ఇచ్చి ఆహ్వానిస్తున్నారు. ఈక్రమంలో కొలికిపూడి సైతం చంద్రబాబుకు వెల్కమ్‌ చెప్పబోగా.. ఆయన అసలు పట్టించుకోలేదు, కనీసం పలకరించలేదు కదా.. చూసీచూడనట్లు సీఎం ముందుకు వచ్చేశారు.  

కొలికిపూడిపై అసంతృప్తి ఎందుకంటే .. 

గత ప్రభుత్వ హయాంలో అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా కొలికిపూడి శ్రీనివాస్‌ వందల డిబేట్లలో పాల్గొన్నారు. ఆయన వాగ్దాటి, పొలిటికల్ నాలెడ్జ్‌, వర్తమాన అంశాలపై విశ్లేషిస్తున్న తీరు టీడీపీ క్యాడర్‌, అగ్రనాయకత్వాన్ని ఆకట్టుకుంది. దీంతో చంద్రబాబు, లోకేష్‌ టీం ఆయనకు తిరువురు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది. గత మూడు దఫాలుగా టీడీపీ అక్కడ అధికారం దక్కించుకోలేకపోయింది. అయితే..2024లో మాత్రం అన్ని కలిసి వచ్చి..  అదృష్టం కొద్దీ కొలికిపూడి ఎమ్మెల్యే అయ్యారు. కానీ ఆయన ఎమ్మెల్యేగా రాణించడంలో మాత్రం తప్పటడుగులు వేస్తున్నారు. ఒకసారి అయితే అనుకోవచ్చు ఏకంగా ఇప్పటికే మూడుసార్లు ఆయన్నీ టీడీపీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి చివాట్లు పెట్టారు. అయినా తీరు మారలేదు. ఎమ్మెల్యేగా అయిన కొత్తలో ఓ వైసీపీ నాయకుడు ఇంటిని చట్టవిరుద్దంగా నిర్మిస్తున్నారని ఆ ఇంటిని జేసీబీతో పడేసేందుకు నేరుగా ఎమ్మెల్యే కొలికిపూడి రంగంలో దిగడం, అక్కడ ఆయన తన కారుపై కూర్చుని తొడకొట్టి, మీసం మెలేస్తూ సవాళ్లు చేయడం అప్పట్లో వివాదాస్పదం అయ్యింది. మరో ఘటనలో మద్యం దుకాణాల నుంచి తనకు రావాల్సిన కప్పం ఇవ్వకపోవడంపై నేరుగా ఎమ్మెల్యే పలు దుకాణాల వద్దకు వెళ్లి వీటిపై రైడ్‌ చేయాలని ఎక్సైజ్‌ పోలీసులకు చెప్పడం అందరినీ ఆర్చర్యానికి గురి చేసింది. తాజాగా తిరువూరు టీడీపీ నాయకుడు, మాజీ ఏంఎంసీ ఛైర్మన్‌ రమేష్‌ రెడ్డి ఓ గిరిజన మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడని అతన్ని టీడీపీ నుంచి సస్పెండ్‌ చేయాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశాడు. 48 గంటల్లో అతన్ని సస్పెండ్ చేయకుండే తానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని టీడీపీ అధిష్టానానికి అల్టీమేటం జారీ చేశారు. ఈ ఘటనతో మరోసారి త్రిసభ్య కమిటీ వేసితిరువూరు ఎమ్మెల్యే తీరుపై నివేదక ఇవ్వాలని టీడీపీ అగ్రనాయకత్వం కోరింది. 

Latest Videos

ఎంపీకి ఎమ్మెల్యే మధ్య గ్యాప్‌.. 

విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్నీ), తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి మధ్య మనస్పర్థలు ఉన్నట్లు టీడీపీ క్యాడర్‌లో చర్చనడుస్తోంది. తాజాగా కొలికిపూడి ఆరోపణలు చేస్తున్న రమేష్ రెడ్డి ఎంపీ వద్దే ఉంటున్నారని, ఆయనకు అనుచరుడు కావడం వల్లే అతనిపై చర్యలు లేవని అంటున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే సైతం పరోక్షంగా చెప్పుకొచ్చారు. అయితే.. ఎమ్మెల్యే తీరుపై వేసిన కమిటీలో ఎంపీ చిన్నీ, ఎన్టీఆర్‌ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో కొలికపూడి వివాదాన్ని పరిష్కరించేందుకు టీడీపీ నాయకత్వం మంత్రి అచ్చెన్నాయుడుకు బాధ్యతలు అప్పగించింది. ఆయన త్వరలోనే వివాదానికి ముగింపు పలికేలా చర్చలు జరుపుతారని సమాచారం. అచ్చెన్నాయుడు నిర్ణయమే తుది నిర్ణయంగా భావిస్తానని కొలికపూడి కూడా వెల్లడించారంట. రమేశ్ రెడ్డి కూడా తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ, ఎంపీ కేశినేని చిన్ని తో భేటీ అయ్యారు. కొలికపూడి చేసిన ఆరోపణలతో పార్టీకి ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పారు. అచ్చెన్నాయుడు నివేదిక ఆధారంగా కొలికపూడిపై పార్టీ శాసనసభా కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కొలికిపూడి వివాదం ఇప్పటికే పార్టీకి తలనొప్పిగా మారగా.. ఇది భవిష్యత్తులో మరింత తీవ్రతరం కానుంది. 

చంద్రబాబు తీరు అంతేనా.. 

కొలికిపూడి తీరుపై టీడీపీ అగ్రనాయకత్వంలో అసంతృప్తి ఉండగా.. తాజాగా చంద్రబాబు సైతం ఎమ్మెల్యేని పలకరించకపోవడంపై ఆయన కూడ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. తిరువూరు ఎమ్మెల్యే తీరు మార్చుకోకపోతే వేటు తప్పదు అన్న సంకేతాలు చంద్రబాబు తీరు చూసిన వారికి అర్థమవుతోంది. ఇప్పటికైనా ఎమ్మెల్యే తీరు మారుతుందో లేదో చూడాలి. 
 

vuukle one pixel image
click me!