పీఆర్పీని అన్నయ్య అందుకే కొనసాగించలేదు: నాగబాబు

By narsimha lodeFirst Published Feb 18, 2019, 12:55 PM IST
Highlights

 అన్నయ్య సున్నితమైన మనస్తతత్వం  కారణంగానే ప్రజా రాజ్యం పార్టీని కొనసాగించలేకపోయారని మెగా బ్రదర్ నాగబాబు అభిప్రాయపడ్డారు. పార్టీని నడపలేమని ప్రతి ఒక్కరూ ఆ సమయంలో  అన్నయ్యపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆయన గుర్తు చేసుకొన్నారు.

హైదరాబాద్: అన్నయ్య సున్నితమైన మనస్తతత్వం  కారణంగానే ప్రజా రాజ్యం పార్టీని కొనసాగించలేకపోయారని మెగా బ్రదర్ నాగబాబు అభిప్రాయపడ్డారు. పార్టీని నడపలేమని ప్రతి ఒక్కరూ ఆ సమయంలో  అన్నయ్యపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆయన గుర్తు చేసుకొన్నారు.

ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు నాగబాబు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో నాగబాబు పలు అంశాలపై తన అభిప్రాయాలను వివరించారు. ప్రజా రాజ్యం పార్టీని ఎందుకు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాల్సి వచ్చిందనే విషయాలపై కూడ ఆయన ఈ ఇంటర్వ్యూలో వివరించారు.

కాంగ్రెస్ పార్టీలో  ప్రజారాజ్యం పార్టీని  విలీనం చేసే  సమయంలో నెలకొన్న పరిస్థితులను ఆయన గుర్తు చేసుకొన్నారు. 2009 ఎన్నికల సమయంలో  18 అసెంబ్లీ స్థానాలతో పాటు 18 శాతం ఓటింగ్, సుమారు 80 లక్షలకు పైగా ఓట్లు ప్రజా రాజ్యం పార్టీ  పొందిందని ఆయన ప్రస్తావించారు. 

అన్నయ్య చాలా సెన్సిటివ్... ఈ కారణంగానే ఆనాడు పార్టీలో ఉన్న కొందరు నేతలు పార్టీని నడపలేమని  పదే పదే చెప్పేవారన్నారు.పీఆర్పీని ఎత్తేయడం కానీ, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలనే ఉద్దేశ్యం తొలుత అన్నయ్యకు లేదన్నారు.

కానీ ఆ రకంగా పరిస్థితులు వచ్చాయన్నారు. అన్నయ్య మొండివాడు కాదు, సున్నితమైన మనస్సు కారణంగానే ఆయన పార్టీని  కాంగ్రెస్‌లో విలీనం చేశారని చెప్పారు. పీఆర్పీని కొనసాగించి ఉంటే  ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేదని  ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

నాగబాబు సంకేతాలు: కాంగ్రెస్‌కు చిరంజీవి దూరమే

 

click me!