మహానాయకుడు ట్రైలర్ పై లోకేష్ ట్వీట్.. నెటిజన్ల ట్రోల్స్

Published : Feb 18, 2019, 11:58 AM IST
మహానాయకుడు ట్రైలర్ పై లోకేష్ ట్వీట్.. నెటిజన్ల ట్రోల్స్

సారాంశం

ఏపీ మంత్రి నారా లోకేష్.. మరోసారి నెటిజన్లకు అడ్డంగా బుక్కయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన ట్వీట్ పై.. నెటిజన్లు విపరీతంగా ఆడుకుంటున్నారు.

ఏపీ మంత్రి నారా లోకేష్.. మరోసారి నెటిజన్లకు అడ్డంగా బుక్కయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన ట్వీట్ పై.. నెటిజన్లు విపరీతంగా ఆడుకుంటున్నారు. ఇంతకీ మ్యాటరేంటంటే.. బాలకృష్ణ లీడ్ రోల్ లో ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ‘ఎన్టీయార్’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మొదటి భాగం విడుదలవ్వగా.. రెండో భాగం విడుదలకు సిద్ధంగా ఉంది.

ఎన్టీయార్ మహానాయకుడు పేరిట ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ని ట్విట్టర్ ట్వీట్ చేసిన లోకేష్.. ‘‘వెండితెర ఇలవేల్పు, తెలుగువారి ఆరాధ్య నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి బయోపిక్ లో రెండవ భాగం 'మహానాయకుడు' చిత్ర ట్రైలర్ అత్యద్భుతంగా, ఆసక్తిని రేకెత్తిస్తోంది. మహానాయకుడుగా బాలా మావయ్య నటన నభూతో నభవిష్యతి’’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

కాగా.. లోకేష్ ట్వీట్ కి పాజిటివ్ కన్నా.. నెగిటివ్ కామెంట్సే ఎక్కువ రావడం గమనార్హం. అటువంటి నాయకుడికి మీరేఁదుకు వేన్నుపోటు పోడిచారు అంటూ కొందు లోకేష్ ని ప్రశ్నించారు. ఇంకొకరు బాలా మామయ్య లోకా అల్లుడు సూపర్ అంటూ ట్వీట్ చేశారు.

ఇక ఇంకొందరేమో.. మహానాయకుడు కన్నా.. లక్ష్మీఎస్ ఎన్టీఆర్ ట్రైలర్ ఇంకా ఆసక్తిగా ఉందని చెప్పడం విశేషం. మహానాయకుడిలో వైఎస్ రాయ్ ఘటన లేదని.. దాని కోసం లక్ష్మీఎస్ ఎన్టీఆర్ చూడాలి అంటూ ట్వీట్ చేస్తున్నారు. ఇలా సెల్ఫ్ డబ్బాలు కొట్టే.. ఫస్ట్ పార్ట్ ని ముంచారు... కొంచెం ఓపిక పట్టండి సామి అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. 

 

PREV
click me!

Recommended Stories

సాయికృష్ణ ఇంటికి వద్ద జగన్ సంచలన ప్రెస్ మీట్ | YS Jagan Sensational Press Meet at Sai Krishna House
కృష్ణలంకలో గాదె సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన జగన్ | YS Jagan Visits Gade Sai Krishna Family