నాగబాబు సంకేతాలు: కాంగ్రెస్‌కు చిరంజీవి దూరమే

By narsimha lodeFirst Published Feb 18, 2019, 12:32 PM IST
Highlights

న్నయ్య రాజకీయాల్లో చురుకుగా లేరు, ఏపీ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విడదీసిన సమయం నుండి కూడ ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారని చిరంజీవి సోదరుడు నాగబాబు చెప్పారు. 


హైదరాబాద్: అన్నయ్య రాజకీయాల్లో చురుకుగా లేరు, ఏపీ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విడదీసిన సమయం నుండి కూడ ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారని చిరంజీవి సోదరుడు నాగబాబు చెప్పారు. రాజకీయాల్లో ఇక అన్నయ్య చురుకుగా పాల్గొంటారని తాను అనుకోవడం లేదన్నారు. పవన్ కళ్యాణ్‌ పార్టీలోకి చిరంజీవి చేరే విషయమై నాగబాబు ఆసక్తికరమైన సమాధానమిచ్చారు.

ఓ తెలుగు న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగా బ్రదర్ నాగబాబు పలు విషయాలపై తన  అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టారు. జనసేన పార్టీలో చిరంజీవి చేరుతారనే ప్రచారంపై కూడ నాగబాబు స్పందించారు. ఈ విషయమై తన కంటే అన్నయ్య చిరంజీవిని అడిగితేనే బాగుంటుందన్నారు. రాజకీయాలకు అన్నయ్య చాలా దూరంగా ఉంటున్నారని  ఆయన చెప్పారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ  విభజించిన కాలం నుండి కాంగ్రెస్ పార్టీకి కూడ అన్నయ్య దూరంగానే ఉంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో చురుకుగా అన్నయ్య లేరని ఆయన గుర్తు చేశారు.

సినీ రంగంలో అన్నయ్య నెంబర్‌వన్ స్థానానికి చేరుకొన్న తర్వాత అన్నయ్యపై తరచూ విమర్శలు చేసేవారని ఆయన గుర్తు చేసుకొన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడ ఇవి కొనసాగాయని ఆయన అబిప్రాయపడ్డారు.
 

click me!