చంద్రబాబు ప్రభుత్వాన్ని మోడి సర్కార్ ముంచేస్తుందా?

First Published Sep 5, 2017, 3:46 PM IST
Highlights
  • కారణాలు స్పష్టంగా తెలీదుకానీ రాష్ట్రానికి అందాల్సిన సహాయంలో కేంద్రం బాగా కోత పడుతోంది.
  • అవసరానికి డబ్బు సర్దబాటు కాక, సొంతంగా డబ్బులు సమకూర్చుకునే మార్గాలు లేక రాష్ట్రం విలవిల లాడిపోతోంది.
  • రాష్టావసరాలకు సరిపడా నిధులను కేంద్రం విడుదల చేయటం లేదు.
  • కేంద్రప్రభుత్వం, ప్రధానంగా ఆర్ధికసంబంధ విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని బాగా బిగించేస్తోంది.

కారణాలు స్పష్టంగా తెలీదుకానీ రాష్ట్రానికి అందాల్సిన సహాయంలో కేంద్రం బాగా కోత పడుతోంది. అవసరానికి డబ్బు సర్దబాటు కాక, సొంతంగా డబ్బులు సమకూర్చుకునే మార్గాలు లేక రాష్ట్రం విలవిల లాడిపోతోంది. కేంద్ర-రాష్ట్రప్రభుత్వాల సంబంధాలు చివరకు ‘అమ్మ పెట్టదు..అడుక్కు తిననీయదు’ అన్నట్లు తయారైంది. రాష్టావసరాలకు సరిపడా నిధులను కేంద్రం విడుదల చేయటం లేదు. అలాగని సొంతంగా అప్పు తెచ్చుకునే అవకాశాలన్నా కల్పిస్తుందా అంటే అదీ లేదు. దాంతో రాష్ట్రం పరిస్ధితి ‘ఒడ్డున పడ్డ చేపలా’ తయారైంది.

కేంద్రప్రభుత్వం ప్రధానంగా ఆర్ధికసంబంధ విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని బాగా బిగించేస్తోంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో కేంద్రం నుండి రాష్ట్రానికి రూ. 21,400 కోట్లు రావాల్సి ఉండగా మొదటి మూడు నెలల్లో వచ్చింది కేవలం రూ. 725 కోట్లు మాత్రమే. ఈ నిధులు కుడా కేంద్ర పథకమైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో వచ్చినవే.

రాజధాని నిర్మాణానికి రూ. 1500 కోట్లు, పోలవరానికి రూ. 7 వేల కోట్లు, ఉపాధిహామీ పథకానికి రూ. 6340 కోట్లు రావాలి. అయితే, ఇంత వరకూ అడ్రస్ లేదు. పైగా ఈనెలాఖరుతో రెండో త్రైమాసికం కుడా అయిపోతోంది. ఇక మిగిలింది ఆరు మాసాలు మాత్రమే. కేంద్రంలోను, రాష్ట్రంలోను ఉండేది మిత్రపక్షాలే అయినా కేంద్రం ఎందుకు అలా వ్యవహరిస్తోందో అర్ధం కావటం లేదు.

పోయిన ఆర్ధిక సంవత్సరంలో కేంద్రం నుండి రావాల్సిన దానికన్నా రూ. 4002 కోట్లు తక్కువచ్చాయి. రెవిన్యూ లోటు భర్తీ, రాజధాని నిర్మాణం, పోలవరం, కేంద్ర సహాయ ప్రాజెక్టులు, నరేగా తదితరాలకు రూ. 11,910 కోట్లు రావాల్సుండగా వచ్చిది రూ. 7908 కోట్లు మాత్రమే. రాజధాని కోసం రూ. వెయ్యి కోట్లు కావాలని రాష్ట్రం కోరగా కేంద్రం ఇచ్చింది రూ. 450 కోట్లు మాత్రమే. అంటే పోయిన సంవత్సరంలో కోత. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకూ నిరాసే. వచ్చే సంవత్సరం ఎన్నికల సంవత్సరం కాబట్టి నిధుల విడుదల అనుమానమే. చూడబోతే మిత్రపక్షమైనా సరే టిడిపిని కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నిండా ముంచేసేట్లే ఉంది.

click me!