రాయలసీమ దుకాణం మూసేసిన బైరెడ్డి, టిడిపిలోకి పయనమేమో...

First Published Sep 5, 2017, 2:54 PM IST
Highlights
  • రాయలసీమ వాదం ఓడిపోయింది
  • రాయలసీమ వాదం ప్రజల్లోకి వెళ్ల లేదు
  • రాయలసీమ పరిరక్షణ సమితి అంగడి బంద్

సరిగ్గా వారం రోజుల కిందట ఏషియానెట్-తెలుగు లో రాసినట్లే జరిగింది.  నంద్యాల ఎన్నికల ఫలితాలు  వైసిపికన్నా, పోటీ చేసిన ఇతర పార్టీలకన్నా బాగా దెబ్బతీసింది రాయలసీమ వాదాన్ని. 

రాయలసీమ నడిబొడ్డున ఉన్న నంద్యాలలో ‘రాయలసీమ వ్యతిరేకి’ అని పేరున్న చంద్రబాబు నాయుడి పార్టీకి రికార్డు స్థాయిలో ఓట్లుపడితే, ‘రాయలసీమోై అని అరుస్తూ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రచారం చేసిన అభ్యర్థి కంటికి కనిపించకుండా పోయాడు. ఇది బైరెడ్డిని తిరస్కరించడ కాదు, రాయలసీమ వాదాన్ని దెబ్బతీయడం.

ఈ  రోజు రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ విషయం అంగీకరించారు. రాయలసీమ పరిరక్షణ సమితి అనే సంస్థను మూసేస్తున్నట్లు ప్రకటించారు. రాయలసీమ వాదాన్ని కర్నూలు పక్కనున్న కృష్ణా పుష్కరఘాట్లో భూస్థాపింతంచేస్తున్నట్లు ప్రకటించారు. దీనికోసం ఆయన కర్నూలులో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి, రాయలసీమ వాదం ఓడిపోయిందని స్పష్టంగా ప్రకటించారు.

ఇక రాయలసీమ వాదాన్నినడిపించే శక్తి లేదని కూడా అన్నారు. ఇక భవిష్యత్ కార్యక్రమం మిటో ఆయన తొందర్లో ప్రకటించనున్నారు. అయితే, ప్రస్తుతానికి ఇలా చెప్పారు. ‘‘రాజకీయాలకుదూరంగా ఉండాలా లేక మరొక పార్టీలో చేరాలా అనే విషయాన్ని ప్రజలే నిర్ణయిస్తారు,’ అని అన్నారు.

తాను రాయలసీమ జిందాబాద్ అంటే స్పందన లేకపోవడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘‘రాయలసీమ వాదన  ప్రజల్లోకి వెల్లలేదు. ఎంతకరువున్నా, కాటకాలున్న, ప్రజలలో రాయలసీమ వాదానికి మద్దతులేదు,’ అన్నారు.

 

ఏషియానెట్- తెలుగు చెప్పిందిదే...

 

click me!