రేపటినుండే 'వై ఏపీ నీడ్స్ జగన్' కార్యక్రమం... టిడిపి వాళ్ళకూ అవకాశం.. : సజ్జల రామకృష్ణారెడ్డి

చంద్రబాబు ముఠా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే వై ఏపి నీడ్స్ జగన్ కార్యక్రమం చేపడుతున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు

Why AP Needs Jagan Programme  starts tomorrow ... Sajjala Ramakrishna Reddy AKP

అమరావతి : అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో వైసిపి ప్రభుత్వం చేసిన అభివృద్ది, అమలుచేస్తున్న సంక్షేమ కార్యాక్రమాల గురించి ప్రజలకు వివరించేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్దమయ్యారు. మరోసారి వైసిపిని ఎందుకు గెలిపించాలో... వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ముఖ్యమంత్రి చేయాలో ప్రజలకు వివరించేందుక 'వై ఏపీ నీడ్స్ జగన్' కార్యక్రమానికి వైసిపి రేపటినుండే ప్రారంభించనుంది.  ఈ కార్యక్రమం గురించి  ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి వివరించారు. 

వైసిపి ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు సుపరిపాలన అందిస్తోందని... ఇప్పటివరకు రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ప్రభుత్వం లబ్ది చేసిందని సజ్జల తెలిపారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలను అమలుచేస్తున్నామని అన్నారు. రాష్ట్ర అభివృద్ది, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని 
సజ్జల తెలిపారు. 

Latest Videos

వైసిపి అధికారంలోకి రాగానే కోవిడ్ వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని... వాటిని దాటుకుని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు సజ్జల తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే సీఎం జగన్ పరితపిస్తారని... వారికోసమే ప్రభుత్వానికి ఆర్థిక భారమైనా అనేక కొత్తకొత్త పథకాలను తీసుకువస్తున్నారని అన్నారు. ఇలా అధికారంలోకి వచ్చిన నాటినుండి నేటివరకు చేపట్టిన అభివృద్ది, సంక్షేమాన్ని ప్రజలకు వివరించనున్నట్లు సజ్జల తెలిపారు. 

Read More  ఉమ్మడి రాష్ట్రాన్ని ముక్కలుచేసింది మన పున్నమ్మే... సర్వనాశనం చేశావుకదమ్మా!: విజయసాయి రెడ్డి

'వై ఏపీ నీడ్స్ జగన్' కార్యక్రమం పార్టీలకు అతీతంగా జరుగుతోందని... వైసిపి పాలనలో జరిగిన అభివృద్ది, సంక్షేమం గురించి ప్రతిపక్ష నాయకులకు కూడా తెలుసని సజ్జల అన్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొనవచ్చని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న పనులను అంకెలతో సహా  చెప్పడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని అన్నారు. ఎక్కడికక్కడ స్థానిక నాయకులే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని సజ్జల వెల్లడించారు. 

వైసిపి అధికారం చేపట్టిన తర్వాత ఈ నాలుగన్నరేళ్ళలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసినట్లు సజ్జల తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను... మొత్తంగా చూసుకుంటే 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసామని వెల్లడించారు. కానీ వైసిపి ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేపట్టడంలేదని ప్రతిపక్షాలు మరీముఖ్యంగా చంద్రబాబు ముఠా ప్రచారం చేస్తోందన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడానికి  వై ఏపి నీడ్స్ జగన్ కార్యక్రమం చేపడుతున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 

vuukle one pixel image
click me!