
రిపబ్లిక్ ఆప్ తాడిపత్రి రూల్ చేస్తున్న జెసి దివాకర్ రెడ్డికి గతంలో ఎవ్వరూ ఎపుడూ ఇవ్వనంత గట్టి వార్నింగ్ ఇచ్చింది వైసిపి.
వైసిపి పట్టిసీమను వ్యతిరేకిస్తున్నదని అవాకులు చెవాకులు పేలితే, నాలుక చీరేస్తామని పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి హెచ్చరిక చేశారు. ఇది వైఎస్, జెసి కుటుంబాల మధ్య మళ్లీ తగవుకు రాజేసే లా ఉంది.
ఈ మధ్య కాలంలో ఈ కుటుంబాల మధ్య వైషమ్యం తగ్గుముఖం పట్టింది. అయితే, అనంతపురం జిల్లాలో జెసి ఎదుర్కొంటున్న వింతసమస్య వల్ల ఆయన జగన్ ను విమర్శించాల్సి వస్తున్నది. అయినాకూడా ఆయనకు జిల్లాలో పరిటాల సునీత, పైయ్యావుల కేశవుల పక్కన సమానమయిన పీట దొరికేట్లు లేదు. ఆహోదా కోసమే జెసి దివాకర్ రెడ్డి వైసిపి విమర్శిస్తున్నానడి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఏకిపారేశారు.
శ్రీకాంత కోపానికి కారణం, ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంబోత్సవ సందర్భంగా జరిగిన ఒక ఘటన . అక్కడి సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ, ఈ ప్రాజక్టుకు పునాది వేసింది రాజశేఖర్ రెడ్డి అని ముఖ్యమంత్రి ముఖం కందిపోయేలా చేశాడు. దీనికి సమాధానంగా జెసి దివాకర్ రెడ్డి కలుగచేసుకుని జగన్ ని, రెడ్డికులాన్ని కూడా పెరెత్తి తిట్టి చంద్రబాబు కు సంతోషం కలిగించారు. జగన్న ముఖ్యమంత్రి కాకుండా తాను అడ్డుకునేందుకు బాబును కలిశానని చెప్పారు. జగన్ ను తిక్కముండాకొడుకు అని వర్ణించాడు. పట్టిసీమను జగన్ వ్యతిరేకిండం...చదువురానివాడా ఇలాంటి పనిచేయడు.
కులం కూడు పెడుతుందా.. రెడ్లు కులం కులం అని చెప్పి ఏ మిసాధించారు అని చెబుతూ రెడ్లు కులవాదాన్నితిట్టారు. చంద్రబాబునాయుడు, ఎన్టీఆర్ ఏ కులమని రాయలసీమలోపేరు పొందారని దివాకర్ రెడ్డి అన్నారు.
వైసిపిని, జగన్ ని విమర్శించడం కులం ప్రస్తావన తీయడం సరికాదు అన్నది శ్రీకాంత్ రెడ్డి వాదన.
చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు దివాకర్ రెడ్డి చాలా కష్టాలు పడుతున్నాడని అందులో భాగంగా వైసిపిని మీద ఆరోపణలుచేస్తున్నాడని అన్నారు. ఈ ఆరోపణలు ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. మళ్లీ ఇలాంటి ఆరోపణలు చేస్తే నాలుక కోసేస్తామన్నాడు.
దివాకర్ రెడ్డి ని జానీవాకర్ రెడ్డి అని పిలిచాడు.
‘నాలుగు పెగ్గులేసుకుని నోటికొచ్చినట్టు మాట్లాడతున్నావు.. జేసీ దివాకర్ రెడ్డి వి కాదు జానీవాకర్ రెడ్డివి’ అని దుయ్యబట్టారు.
కులం గురించి ఆయన నోటికొచ్చినట్టు ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. జేసీ చరిత్ర అంతా దోచేకోవడమేనని ఆరోపించారు.
‘దోచుకునే సునీత , కేశవ్ లమధ్య సీటు దొరకలేదు. అలాగని చంద్రబాబు నాయుడిని విమర్శించలేడు. ఎందుకంటే,జైలుకెళ్లాల్సి వస్తుంది. ఇది జెసి పరిస్థితి,’ అని శ్రీకాంత్ రెడ్డి అన్నాడు.
ఇంత ఘాటైన విమర్శకు జెసి ఎలా స్పందిస్తాడో చూడాలి.
రాజకీయాలలో ఇంత దారుణమయిన దాడులు, ఎదురు దాడులు అవసరమా?