ప్రభుత్వానికి మొదలైన తలనొప్పులు

Published : Jan 03, 2017, 09:13 AM ISTUpdated : Mar 25, 2018, 11:48 PM IST
ప్రభుత్వానికి మొదలైన తలనొప్పులు

సారాంశం

ఉద్ధానం కిడ్నీ బాధితుల పక్షాన పవన్ ఉద్యమం చేస్తానని ప్రకటించగానే తనను తాను సమర్ధించుకునేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అవస్తలు పడుతున్నారు.

ఉద్ధానం సమస్యపై పవన్ కల్యాణ్ లేవనెత్తిన సమస్యలకు సమాధానం చెప్పటానికి ప్రభుత్వం అవస్తలు పడుతోంది. ఉద్ధానం కిడ్నీ బాధితుల పక్షాన పవన్ ఉద్యమం చేస్తానని ప్రకటించగానే తనను తాను సమర్ధించుకునేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అవస్తలు పడుతున్నారు.

 

5వ తేదీన శ్రీకాకుళం పర్యటనలో భాగంగా ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముంబాయికి చెందిన ఓ పరిశోధన సంస్ధ అవరమైన శ్యాంపిల్స్ తసుకెళ్లిందని చెప్పారు. ఇంకా నివేదిక అందాలన్నారు. గతంలో కూడా ఎన్నోసార్లు పరిశోధనలు జరిగినా సమస్యకు మూలాలు మాత్రం తెలియలేదని అన్నారు.

 

ఇప్పటి వరకూ జరిగిన పరిశోధనల్లో  కిడ్నీ సమస్యకు జన్యుపరమైన అంశం కారణం కాదని తేలిందన్నారు. నీటి లభ్యత, భూగర్భ జలాలు కారణం అయివుండవచ్చని అనుమానాన్ని వ్యక్తం చేసారు. బాధిత కుటుంబాలకు ఆర్ధిక సాయం  అందించే విషయాన్ని సిఎంతో చర్చించాలన్నారు.

 

కిడ్నీ సమస్యలున్న ప్రాంతాల్లో శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నట్లు చెప్పారు. మరి, ఇంతకుముందు ఎప్పుడు ఉద్ధానం ప్రాంతాల్లో ఇవి చేస్తున్నట్లు ప్రభుత్వం ఎప్పుడూ ప్రకటించక పోవటం గమనార్హం.

 

ప్రభుత్వంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళయినా ఉద్ధానం సమస్యను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదంటే సమధానం చెప్పలేకపోయారు. ఉత్తరాంధ్ర మొత్తం మీద నెఫ్రాలజిస్టు ఒక్క కెజిహెచ్ లో తప్ప ఇంకెక్కడా లేరన్నారు. ఎక్కడపడితే అక్కడ నెఫ్రాలజిస్టులు కావాలంటే ఇవ్వటం సాధ్యం కాదన్నారు.

 

డయాలసిస్ కేంద్రాలను మంజూరు చేస్తున్నామని, పాలకొండకు ఒకటి మంజూరైందన్నారు. సోంపేటలో కూడా మరోటి కావాలంటే కేంద్రం మంజూరు చేస్తామని హామీ ఇచ్చిందని కామినేని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?