టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదలకు ముహూర్తం ఎప్పుడంటే...

By SumaBala Bukka  |  First Published Dec 30, 2023, 2:31 PM IST

ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, ఎన్ని సీట్లలో ఎవరెవరు పోటీ చేయాలని ఒక నిర్ణయానికి కూడా వచ్చింది. అలానే ఎన్నికలకు ప్రధానమైన మేనిఫెస్టోను కూడా సిద్ధం చేస్తుంది. ఇప్పటికే మినీ మేనిఫెస్టో పై ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో ఉమ్మడి మేనిఫెస్టోపై కూడా కసరత్తు చేస్తుంది.


అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి మొదలైపోయింది. అన్ని పార్టీలూ రణరంగానికి సిద్దమవుతున్నాయి. ఒకపార్టీలో టికెట్ దొరకదని తెలిస్తే మరోపార్టీలోకి మారుతున్నారు నేతలు. ఎన్నికలకు కౌంట్ డౌన్ దగ్గరపడుతున్నకొద్దీ పార్టీలు మారేవారి సంఖ్య పెరుగుతోంది. దీంతోపాటే కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ-జనసేన పొత్తులో ఉండగా.. దీంతో బీజేపీ కలిసే అవకాశాలూ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ అభ్యర్థుల జాబితాపై ఆసక్తి నెలకొంది. 

టీడీపీ మొత్తం నియోజకవర్గాల్లో అభ్యర్థులను ముందే ప్రకటించేస్తుందని, ఆయా అభ్యర్థులు నియోజకవర్గాల్లో గెలుపుకోసం కృషి చేసుకోవాలని చంద్రబాబు నాయుడు గతంలో ప్రకటించారు. ఆ తరువాత పరిస్థితులు మారిపోయాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్, రాజమండ్రి జైలుకు వెళ్లడం, బెయిల్ మీద విడుదలవ్వడం ఇలా మూడు నెలల పాటు అభ్యర్థుల ప్రకటనకు హాల్ట్ పడింది. 

Latest Videos

ఒక్క అభ్యర్థుల ప్రకటనే కాదు పూర్తిగా టీడీపీ మొత్తం పని ఎక్కడిదక్కనే ఆగిపోయింది. అరెస్ట్ కాకముందే చంద్రబాబు 125 నియోజకవర్గాల్లో రివ్యూ చేయించాడు. దాని ప్రకారం గెలుపు అవకాశాలున్న వారిని టికెట్ ఇస్తాం, పని చేసుకోమన్నారు. తరువాతి క్రమంలో జెయిల్ లో ఉన్నప్పుడు జనసేనతో దోస్తీ కుదిరింది. బెయిల్ మీద విడుదలయ్యాక అధికారికంగా పొత్తు ప్రకటించారు. 

జగన్ చుట్టూ దద్దమ్మలు చేరిపోయారు.. ఎమ్మెల్సీ వంశీ కృష్ణ ( వీడియో )

జనసేనతో కలిసి ఉమ్మడిగా పోటీకి వెడుతున్నట్లుగా ప్రకటించారు. దీంతో ముందు ప్రకటించినట్లుగా ఇప్పుడు టికెట్లు ఇవ్వడానికి కుదరదు. జనసేనకు ఎక్కడ, ఎన్ని సీట్లు ఇవ్వాలో సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ముందునుంచీ అనుకుంటున్నట్లుగా బీజేపీ కూడా టీడీపీతో చేతులు కలిపితే.. బీజేపీకి సీట్లు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో టీడీపీ నుంచి టికెట్ దక్కనివారిని పార్టీనుంచి పోకుండా కాపాడుకోవాల్సి ఉంటుంది. 

పొత్తు రావడంతో ఏ నియోజకవర్గాల్లో సీట్లు వస్తాయో, ఏ నియోజకవర్గాల్లో రావో తెలియని పరిస్థితి. ఇప్పటికే జనసేన 45 సీట్లు అడుగుతోంది. కానీ 24నుంచి 28 సీట్లు మాత్రమే ఇవ్వాలని టీడీపీ చూస్తుంది. వీటితో పాటు జనసేనకు మూడు ఎంపీలు కేటాయించాలనే యోచనలో ఉంది. మరోవైపు వీరిద్దరితో.. బీజేపీ కలిస్తే ఇంకొన్ని సీట్లు జనసేనకు తగ్గే అవకాశం ఉంది.

డీకే శివకుమార్, చంద్రబాబును కలిసిన తరువాత బీజేపీ కాస్త తొందరపడుతోంది. పొత్తుల గురించి ఏపీ బీజేపీలో కదలిక మొదలయ్యింది. బీజేపీ అధిష్టానం నుంచి ఏపీ బీజేపీ నేతలకు ఫోన్స్ వచ్చాయి. పొత్తులో వెలితే ఎలా ఉంటుంది? పొత్తు లేకపోతే ఎలా ఉంటుంది? అని అడిగినట్లు సమాచారం. ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీకి దిగే ప్రశ్నే లేదు. అలాంటప్పుడు పొత్తుతో వెడితే కొన్ని సీట్లైనా వచ్చే అవకాశం ఉందని నేతలు చెప్పినట్లు సమాచారం.

గత ఎన్నికల్లో వైసిపి ఒంటరిగా పోటీ చేసి 151 సీట్లతో విజయఢంకా మోగించింది. టీడీపీ ఒంటరిగానే పోటీచేసి, 23 సీట్లకే పరిమితమైంది. జనసేన, సిపిఐ, సిపిఎం, బీఎస్పీలతో జతకట్టి ఘోర పరాజయం పాలయ్యింది. బిజెపి కూడా ఒంటరిగా బరిలోకి దిగి ఓటమిపాలైంది..

దీంతో మూడు పార్టీలు కలిసి వెళ్లడం వల్ల మరింత బలం చేకూరుతుందని, దీనివల్ల అధికార వైసీపీని ఎలాగైనా ఓడించాలని, మళ్లీ ఏపీలో అధికారంలోకి రావాలని ఆశిస్తున్నాయి. ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, ఎన్ని సీట్లలో ఎవరెవరు పోటీ చేయాలని ఒక నిర్ణయానికి కూడా వచ్చింది. అలానే ఎన్నికలకు ప్రధానమైన మేనిఫెస్టోను కూడా సిద్ధం చేస్తుంది. ఇప్పటికే మినీ మేనిఫెస్టో పై ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో ఉమ్మడి మేనిఫెస్టోపై కూడా కసరత్తు చేస్తుంది.. ఓ పక్క మేనిఫెస్టో మరోపక్క అభ్యర్థుల ఖరారు పైన దృష్టి పెట్టి పనిచేస్తుంది.

మరోవైపు టిడిపి తో జనసేన పొత్తుకు ముందు 2024 ఎన్నికలకు జనసేనతో కలిసి పోటీ చేయాలని బిజెపి భావించినప్పటికీ ఇప్పుడవి వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు. ఇప్పటికీ జనసేన మాతో పొత్తులో ఉందని బిజెపి చెబుతోంది.  జనసేన కూడా బిజెపిని తమతో పొత్తు పెట్టుకోవాలనే కోరుతోంది. ఏపీ బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి ఇష్టంగానే ఉన్నప్పటికీ టిడిపి ఉండటం వల్ల వాళ్లు జనసేనతో కలవడానికి ఇష్టపడడం లేదు.

ఇక ఇందులో కూడా కొంతమంది టీడీపీ జనసేన పొత్తుతో కలవడానికి ఓకే అంటే మరి కొంత మంది మాత్రం వద్దని వారిస్తున్నారు. దాంతో ఏపీలో బిజెపి దారెటో తెలియకుండా ఉంది. ఈ క్రమంలోనే టీడీపీ అభ్యర్థుల జాబితా ఎప్పుడు విడుదలవుతందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

click me!