జగన్ చుట్టూ దద్దమ్మలు చేరిపోయారు.. ఎమ్మెల్సీ వంశీ కృష్ణ ( వీడియో )

By SumaBala Bukka  |  First Published Dec 30, 2023, 1:28 PM IST

ఈ సందర్భంగా మంత్రి అమర్ నాథ్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి అమర్ నాథ్ పార్టీ మారినప్పుడు ఆత్మహత్య కాదా..? నేను పార్టీ మారితే ఆత్మహత్య అవుతుందా..? అంటూ సూటిగా ప్రశ్నించారు.


విశాఖ : వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ జనసేనలో చేరారు తనకు పార్టీలో ఎదురైన అనుభవాల దృష్ట్యానే తాను పార్టీ వీడానని చెప్పుకొచ్చారు. ఆత్మవిశ్వాసం ఉన్న వారేవ్వరూ నా అంత అవమానాలు భరించి వైసీపీలో ఉండరన్నారు ఎమ్మెల్సీ వంశీకృష్ణ. పార్టీలో ఉన్నంతకాలం పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్నారు. ఈ రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పార్టీ కార్యాలయాన్ని నడిపించింది బహుశా నేనే కావచ్చు అన్నారు. నా మీద కామెంట్స్ చేసే వెదవలు ఈ విషయాలు తెలుసుకొని మాట్లాడాలని విరుచుకుపడ్డారు. 

Latest Videos

రాజకీయాల్లోకి వచ్చి 60 ఎకరాలు అమ్ముకున్నాను. నన్ను ఎవరూ తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పుకొచ్చారు ఎమ్మెల్సీ వంశీకృష్ణ. నన్ను రెచ్చగొట్టారు అందుకే ప్రెస్ మీట్ పెట్టానన్నారు. వైసీపీ బీసీలను బాగా చూస్తే.. మేమంతా ఎందుకు బయటకు వచ్చామంటూ ఎదురుప్రశ్నించారు. టాప్ 10 బీసీలు వైసీపీకి యాంటీగా ఉన్నారన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి అమర్ నాథ్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి అమర్ నాథ్ పార్టీ మారినప్పుడు ఆత్మహత్య కాదా..? నేను పార్టీ మారితే ఆత్మహత్య అవుతుందా..? అంటూ సూటిగా ప్రశ్నించారు. అమర్ నువ్వు పార్టీలోకి ఎప్పుడొచ్చావ్..అని అడిగారు. తాను పార్టీ కోసం జీవితం ధార పోసానని చెప్పుకొచ్చారు. అమర్ నాథ్ తన కన్నా వెనక వచ్చి జాకపాట్ కొట్టాడన్నారు. 

జగన్ ని బూతులు తిట్టిన వారే ఇప్పుడు మంత్రులుగా ఉన్నారని, ఏయూ మాజీ వీసీ కార్పొరేటర్ల టికెట్లు డిసైడ్ చేశారని చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్రలో పార్టీ పదవులు వేసింది వీసీ ప్రసాద్ రెడ్డినే అన్నారు. నా స్థలాలన్నీ ప్రభుత్వ భూముల జాబితాలో పెట్టాలని చూసారన్నారు. మద్యం, డబ్బులు పంపించి నన్ను ఓడించాలని చూసారు. మంత్రుల దగ్గర నుంచి అందరూ వెళ్లి ప్రసాద్ రెడ్డి కాళ్ళు పట్టుకుంటున్నారని, వైసీపీకి మాజీ వీసీ ప్రసాద్ రెడ్డికి సంబంధం ఏమిటి..? అంటూ ప్రశ్నించారు. 

జగన్ చుట్టూ దద్దమ్మలు చేరిపోయారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ పరిస్థితి కి కారణం ఆయన సలహా దారులే అన్నారు. జగన్ జైల్ లో ఉన్నపుడు ఆయన కోసం పనిచేసిన వారెవరో తెలుసుకోవాలని అన్నారు. నేను వైసిపి నాయకులను ఒక్క మాట కూడా అనలేదు. కానీ, నా మీద కొంత మంది ప్రెస్ మీట్ లు పెట్టీ మాట్లాడారు. నేను పార్టీ మారడానికి కారణం చెబుతూ జగన్ గారికి లేఖ పంపించాను. పార్టీలో నాకు ఎదురైన అనుభవాలు ఆ లేఖలో పెట్టానని చెప్పుకొచ్చారు. 

వైసిపి సాధికార బస్సు యాత్ర ఎందుకోసం, పనికి రాని యాత్ర అది అంటూ మండిపడ్డారు. మంత్రి అమర్ జాక్ పాట్ కొట్టాడు. అమర్ కి నా గురించి మాట్లాడే అర్హత లేదు. సిగ్గు లేక నా మీద సోషల్ మీడియాలో వెదవలు పోస్టులు పెడుతున్నారని అన్నారు. 

ఇప్పటికైనా జగన్ కళ్ళు తెరిచి ఎవరు మనవాళ్లో తెలుసు కోవాలన్నారు. నేను చేసింది నాకు జగన్ కు మాత్రమే తెలుసు. జగన్ ను అభిమానించే టాప్ 5 లో నేను ఉన్నానని జగన్ నాకు చెప్పారు. నమ్మి నందుకు నన్ను మోసం చేశారు. ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 నియోజక వర్గాల్లో ఒక్క సీటు గెలిచిన చూపించండి అని సవాల్ విసిరారు.

పార్టీలో చేరతానని అడగగానే రమ్మని ఆహ్వానించిన పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు అన్నారు. ఎన్నికల సమయానికి ఉత్తరాంధ్రలో వైసిపి ఖాళీ చేస్తానన్నారు. వైసిపి లో కంటే రెట్టింపు ఉత్సాహంతో జనసేనలో పనిచేస్తానన్నారు. నన్ను టచ్ చేస్తే ఎలా ఉంటాదో చూపిస్తానని హెచ్చరించారు. మా నాయకుడు చెబితే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. 

ఇక్కడ అంత నీతిమంతులు ఎవరు లేరని మా నాయకుడు చెప్పారు. నా పొలిటికల్ జీవితం నాశనం అవడానికి కారణం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అని, ఇప్పుడు అతని అంతు చూడడమే తన వంతు అని,  ఎంవీవీ సత్యనారాయణ రాజకీయాల నుంచి పారిపోయేలా చేస్తానన్నారు. ప్రతి నియోజక వర్గం లోని ఉమ్మడి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. విశాఖ సిటీలో ఎక్కడ నుంచైనా పోటీ చేసే సత్తా తనకు ఉందన్నారు. 

click me!