వైఎస్‌ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా :అందరి చూపు సీబీఐ వైపే

By narsimha lode  |  First Published Apr 28, 2023, 5:45 PM IST

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  ముందస్తు బెయిల్ పిటిషన్ పై  ఇవాళ తీర్పు  ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పినందున  సీబీఐ  అధికారులు  ఏం చేస్తారనేది  ప్రస్తుతం  ఆసక్తి నెలకొంది.  



హైదరాబాద్: కడప ఎంపీ  వైఎస్ అవినాష్ రెడ్డి  ముందస్తు బెయిల్ పిటిషన్ పై   ఇవాళే  తీర్పు ఇవ్వలేమని  తెలంగాణ హైకోర్టు  శుక్రవారంనాడు  తేల్చి చెప్పింది.ఈ పిటిషన్ పై విచారణ వాయిదా పడిన తర్వాత   సీబీఐ అధికారులు  కోఠిలోని తమ కార్యాలయంలో   సమావేశమయ్యారు.  సీబీఐ అధికారులు  ఏం చేస్తారనేది  ప్రస్తుతం  ఉత్కంఠ నెలకొంది. 

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసులో  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  ముందస్తు బెయిల్ కోరుతూ  తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు  చేశారు.ఇవాళ  మధ్యాహ్నం మూడున్నర గంటలకు  ఈ పిటిషన్ పై విచారణ  నిర్వహించాల్సి ఉంది.  అయితే   ఇవాళ వాదనలు విన్నా కూడా  తీర్పు ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది.  అత్యవసరమైనందున ఈ పిటిషన్ పై వాదనలు వినాలని చీఫ్ జస్టిస్ ను  వైఎస్ అవినాష్ రెడ్డి  తరపు న్యాయవాదులు  కోరార. దీనికి హైకోర్టు చీఫ్ జస్టిస్  నిరాకరించారు.  ఈ పిటిషన్  పై విచారణ కోసం  సీబీఐ  దర్యాప్తు  అధికారి  వికాస్  హైకోర్టుకు  వచ్చారు. ఈ పిటిషన్ పై విచారణను  వాయిదా వేయడంతో  వికాస్   కోఠిలోని  సీబీఐ కార్యాలయానికి  చేరుకున్నారు . కోఠిలోని తమ కార్యాలయంలో  సీబీఐ అధికారులతో ఆయన  సమావేశమయ్యారు.  

Latest Videos

undefined

మరో వైపు హైకోర్టు నుండి వచ్చిన సీబీఐ అధికారులు  కోఠిలోని కార్యాలయంలో సమావేశమయ్యారు.  వైఎస్ అవినాష్ రెడ్డి  ముందస్తు బెయిల్ పై  హైకోర్టు  తీర్పు  ఇవ్వలేమని చెప్పినందున  సీబీఐ  అధికారులు  ఎలా వ్యవహరిస్తారని  అంతా  ఆసక్తిగా  చూస్తున్నారు.  సీబీఐ  కార్యాలయం వద్ద  బందోబస్తు  ఏర్పాటు  చేశారు.

also read:ఇవాళే తీర్పు చెప్పలేం: వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై తెలంగాణ హైకోర్టు

ముందస్తు బెయిల్ పిటిషన్ పై  వైఎస్ అవినాష్ రెడ్డి  తరపు న్యాయవాదులు ఏం చేయనున్నారనే  విషయమై  ప్రస్తుతం అంతా ఆసక్తిగా  చూస్తున్నారు.  ముందస్తు బెయిల్ పిటిషన్ పై  లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తారా , వేకేషన్ బెంచ్ ను ఆశ్రయిస్తారా, సుప్రీంకోర్టుకు  వెళ్తారా అనే విషయమై  ఇంకా స్పష్టత రాలేదు. 
 

click me!