మహా నాయకుడు' సినిమా: హైలైట్‌గా చంద్రబాబు రోల్

First Published Feb 22, 2019, 2:46 PM IST

మహా నాయకుడు సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రను హైలైట్‌ గా చూపించారు. 1984 సంక్షోభంలో ఎమ్మెల్యేలు చేజారిపోకుండా బాబు చేసిన వ్యూహలను సినిమాలో చూపించారు. 

మహా నాయకుడు సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రను హైలైట్‌ గా చూపించారు. 1984 సంక్షోభంలో ఎమ్మెల్యేలు చేజారిపోకుండా బాబు చేసిన వ్యూహలను సినిమాలో చూపించారు. 1984 ఆగష్టు సంక్షోభం తర్వాత ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడంలో బాబు ఏ రకమైన పాత్ర పోషించారనే విషయాలపై కూడ సినిమాలో ఆసక్తికరంగా కొన్ని సన్నివేశాలను పొందుపర్చారు.
undefined
మహానాయకుడు సినిమాలో చంద్రబాబునాయుడు పాత్రపై ఆసక్తి నెలకొంది. టీడీపీని ఏర్పాటు చేసిన సమయంలో చంద్రబాబునాయుడు మంత్రిగా ఉన్నారు. ఆయన ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో కూడ బాబు పనిచేశారు. ఈ సమయంలో పార్టీ ఆదేశిస్తే తాను ఎన్టీఆర్‌పై కూడ పోటీ చేస్తానని ప్రకటించినట్టుగా సినిమాలో చూపించారు.
undefined
1983 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేశారు. కానీ, ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చేతిలో చంద్రబాబు ఓటమి పాలైనట్టుగా సినిమాలో చూపించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి చంద్రబాబునాయుడు హాజరౌతారు.ఆ సమయంలో చంద్రబాబునాయుడు అక్కినేని నాగేశ్వరరావు పక్కనే కూర్చొన్నట్టుగా సినిమాలో ఉంది.
undefined
ANR
undefined
ఈ సమయంలోనే భువనేశ్వరీతో కలిసి చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ ఇంటికి వస్తారు. ఈ సమయంలోనే ఎన్టీఆర్‌‌తోనే ఉంటున్న కొందరు ఆయనకు వ్యతిరేకంగా చేసే వ్యాఖ్యలను చంద్రబాబునాయుడు విన్నట్టుగా సినిమాలో చూపించారు. అయితే జాగ్రత్తగా ఉండేలా ఎన్టీఆర్‌కు సూచించాలని దగ్గుబాటికి బాబు చెప్పినట్టుగా సినిమాలో చూపిస్తారు.
undefined
అయితే తాను చెప్పదల్చుకొన్న అంశాన్ని చంద్రబాబునాయుడే నేరుగా ఈ విషయాలను ఎన్టీఆర్‌కు చెప్పినట్టుగా ఈ సినిమాలో చూపించారు. అయితే ఈ పరిణామాలపై చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్తాడు. మరునాడు ఉదయమే చంద్రబాబునాయుడు ఇంటికి ఎన్టీఆర్ ఫోన్ చేసి పిలిపించినట్టుగా సినిమాలో చూపించారు.
undefined
అదే సమయంలో నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్‌తో సమావేశమౌతారు. అదే సమయంలో చంద్రబాబునాయుడు వచ్చినట్టుగా సినిమాలో చూపించారు. చంద్రబాబునాయుడును పార్టీలోకి తీసుకొంటున్నట్టు ఎన్టీఆర్ నాదెండ్లకు చెప్పినట్టుగా సినిమాలో చూపించారు. అయితే ఈ ప్రతిపాదనను నాదెండ్ల అయిష్టంగానే ఒప్పుకొన్నట్టు సినిమాలో చూపించారు.
undefined
ఆ తర్వాత పార్టీలో తాను పాలేరుగా పనిచేస్తానని చంద్రబాబునాయుడు ఎన్టీఆర్‌కు హామీ ఇచ్చినట్టు సినిమాలో చూపారు. గ్రామస్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలని ఎన్టీఆర్ కోరినట్టు సినిమాలో చూపారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు తగ్గింపు విషయమై ఉద్యోగుల నుండి వచ్చిన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు హెచ్చరించినట్టుగా సినిమాలో చూపారు. కానీ ఈ నిర్ణయాన్ని అమలు చేయడంతో ఎన్టీఆర్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నట్టుగా చూపారు.
undefined
ఎన్టీఆర్ గుండె ఆపరేషన్ కోసం అమెరికాకు వెళ్లిన సమయంలో చంద్రబాబునాయుడు పార్టీకి నష్టం వాటిల్లకుండా నాదెండ్ల భాస్కర్ రావు చర్యలకు అడ్డుపడినట్టుగా సినిమాలో చూపారు. ఎన్టీఆర్‌ లేకుండా మంత్రివర్గ సమావేశం పెట్టడాన్ని ఉపేంద్ర, చంద్రబాబునాయుడు వ్యతిరేకించినట్టు చూపించారు. ఎన్టీఆర్ అమెరికా నుండి రాగానే నాదెండ్ల భాస్కర్ రావు తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ సమయంలో ఎమ్మెల్యేలను చేజారకుండా చంద్రబాబునాయుడు ప్లాన్ చేస్తారు.
undefined
టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరూ కూడ నాదెండ్ల క్యాంప్ కు వెళ్లకుండా రామకృష్ణ స్టూడియోలో ఎమ్మెల్యేలను ఉంచుతారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సహాయంతో నాదెండ్ల భాస్కర్ రావు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గే ప్రయత్నం చేసినట్టుగా సినిమాలో చూపించారు. ఈ సమయంలో స్టూడియోలో ఉన్న ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకొనేందుకు నాదెండ్ల ప్రయత్నాలు చేసినట్టుగా సినిమాలో చూపారు.
undefined
ఈ సమయంలో చంద్రబాబునాయుడు వ్యూహత్మకంగా వ్యవహరించినట్టుగా సినిమాలో చూపించారు. ఆ తర్వాత ఢిల్లీకి రాష్ట్రపతి వద్ద ఎమ్మెల్యేల పరేడ్ కోసం రైళ్లో తీసుకెళ్లే సమయంలో కూడ ఎమ్మెల్యేలు చేజారకుండా బాబు పక్కా ప్లాన్‌ ప్రకారంగా వెళ్లినట్టుగా సినిమాలో చూపించారు. ఢిల్లీ నుండి ఎమ్మెల్యేలతో చంద్రబాబునాయుడు ప్రత్యేక విమానంలో హైద్రాబాద్‌కు బయలుదేరినట్టుగా చూపించి బెంగుళూరులో ఎమ్మెల్యేలతో క్యాంప్ ఏర్పాటు చేసినట్టు సినిమాలో చూపించారు. ఈ ఎమ్మెల్యేలు హైద్రాబాద్‌కు వస్తే ఎయిర్‌పోర్ట్‌లోనే వారిని తమ వైపుకు తిప్పుకొనేందుకు నాదెండ్ల వర్గం చేసిన ప్లాన్‌ను బాబు తిప్పికొట్టినట్టుగా చూపించారు.
undefined
మరో వైపు అసెంబ్లీలో విశ్వాస తీర్మాణంపై ఓటింగ్ జరగకుండా వాయిదా పడిన సమయంలో కూడ ఎమ్మెల్యేలు జారిపోకుండా బాబు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టుగా సినిమాలో చూపించారు. రామకృష్ణ స్టూడియోకు తనకు తెలియకుండా ఎవరూ కూడ రాకుండా ఆంక్షలు విధించినట్టుగా చూపించారు. బెంగుళూరు నుండి నేరుగా ఎమ్మెల్యేలతో చంద్రబాబునాయుడు అసెంబ్లీకి వచ్చిన సమయంలో కూడ ప్రత్యర్థులు ఎంత రెచ్చగొట్టినా కూడ సహనంతో ఉండాలని బాబు ఎమ్మెల్యేలకు సూచినట్టుగా చూపిస్తారు.
undefined
టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు కసరత్తును నిర్వహిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, పార్టీ ఇంచార్జీల పనితీరు ఆధారంగా ఈ దఫా టిక్కెట్లను కేటాయించాలని చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు.ఈ మేరకు జాబితా తయారీ కోసం బాబు పార్టీ నేతలతో సమావేశాలను నిర్వహిస్తున్నారు.
undefined