'మహానాయకుడు' సినిమా: నాదెండ్లే విలన్

First Published Feb 22, 2019, 12:42 PM IST

ఊహించిందే జరిగింది,   1984 ఆగష్టు సంక్షోభంలో ఎన్టీఆర్‌ను గద్దె దించడంలో నాదెండ్ల కీలక పాత్ర పోషించినట్టుగా మహానాయకుడు సినిమాలో చూపించారు. 

ఊహించిందే జరిగింది, 1984 ఆగష్టు సంక్షోభంలో ఎన్టీఆర్‌ను గద్దె దించడంలో నాదెండ్ల కీలక పాత్ర పోషించినట్టుగా మహానాయకుడు సినిమాలో చూపించారు. ఎన్టీఆర్‌ను సీఎం పీఠం నుండి దింపేందుకుగాను కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా నాదెండ్లను ఉపయోగించుకొందో ఈ సినిమాలో దర్శకుడు తెరకెక్కించారు.
undefined
ఎన్టీఆర్ బయోపిక్‌పై తనకు వ్యతిరేకంగా ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం చేస్తూ సినిమా విడుదలకు ముందే నాదెండ్ల భాస్కర్ రావు నోటీసులు కూడ పంపారు.కానీ, సినిమా విడుదలైంది. నాదెండ్ల భాస్కర్ రావు ఊహించినట్టుగానే ఈ సినిమాలో ఆయనకు వ్యతిరేకంగా సన్నివేశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కీలక నిర్ణయాల్లో భాస్కర్ రావు వ్యవహరించిన తీరు వల్లే పార్టీని నష్టం వాటిల్లినట్టుగా ఈ సినిమాలో చూపించారు. 1983లో ఎన్టీఆర్ తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉద్యోగుల వయో పరిమితిని కుదింపు నిర్ణయం ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచింది.
undefined
నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించే ఉద్దేశ్యంతోనే ఉద్యోగుల రిటైర్మెంట్ వయోపరిమితిని 58 ఏళ్ల నుండి 55 ఏళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకొన్నారు. ఈ నిర్ణయం వెనుక నాదెండ్ల భాస్కర్ రావు కీలకంగా ఉన్నారని ఈ సినిమాలో చూపించారు.
undefined
నాదెండ్ల భాస్కర్ రావు ప్రతిపాదన పట్ల ఆనాడు చంద్రబాబునాయుడు వ్యతిరేకించినట్టుగా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును మూడేళ్ల పాటు తగ్గించిన తర్వాత సచివాలయానికి వచ్చిన ఎన్టీఆర్‌పై ఉద్యోగ సంఘాలు తీవ్ర స్థాయిలోనిరసన వ్యక్తం చేస్తారు. ఓ ఉద్యోగి ఏకంగా ఎన్టీఆర్ చొక్కా పట్టుకొని లాగడాన్ని చూపిస్తారు. అయితే ఈ నిర్ణయాన్ని ఆ తర్వాత వెనక్కు తీసుకొన్నట్టుగా సినిమిాలో చూపించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తీసుకొన్న కొన్ని నిర్ణయాలు నాదెండ్ల భాస్కర్ రావుతో పాటు ఆయన వెన్నంటి ఉన్న కొందరు ఎమ్మెల్యేల్లో అసంతృప్తిని కల్గించినట్టుగా సినిమాలో చూపించారు.
undefined
లంచం తీసుకొంటుండగా ఏకంగా ఓ మంత్రిని ఏసీబీకి ఎన్టీఆర్ పట్టించినట్టుగా ఈ సినిమాలో చూపించారు. తమ స్వంత పనులు కూడ చేసుకోలేకపోతున్నట్టుగా ఎమ్మెల్యేలు, మంత్రులు నాదెండ్ల వద్ద తమ బాధలను ఏకరువు పెడతారు. అయితే ఎమ్మెల్యేల సంతకాలను నాదెండ్ల భాస్కర్ రావు ముందుగానే తీసుకొంటారు. ఎమ్మెల్యేల డిమాండ్లను ఎన్టీఆర్‌కు విన్పించేందుకుగాను ఈ సంతకాలు తీసుకొన్నట్టుగా సినిమాలో చూపించారు. అదే సమయంలో రాష్ట్రానికి నిధులు, హక్కుల విషయంలో ప్రధానమంత్రితో ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీఆర్ గొడవ పెట్టుకొని ఆ సమావేశాన్ని బైకాట్ చేస్తారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేస్తానని ఎన్టీఆర్ ప్రకటించినట్టుగా సినిమాలో చూపించారు.
undefined
తన భార్య బసవతారకం క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌, తన గుండె ఆపరేషన్ కోసం ఎన్టీఆర్ అమెరికాకు వెళ్తారు.ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లే సమయంలో విమానాశ్రయంలో ఎన్టీఆర్‌ను నాదెండ్ల భాస్కర్ రావు వీడ్కోలు పలికినట్టుగా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ అమెరికాలో ఉన్న సమయంలోనే నాదెండ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు సన్నాహలు చేసుకొన్నట్టుగా చూపించారు. ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లగానే నాదెండ్ల భాస్కర్ రావు ఢిల్లీ వెళ్లి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని కలిసినట్టుగా చూపించారు. ఆ తర్వాత తనకు అవసరమైన సహాయాన్ని చేయాలని ఆయన ఆమెను కోరినట్టుగా సినిమాలో ఉంది.
undefined
అప్పటికే రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న రాంలాల్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీతో కలిసి నాదెండ్ల భాస్కర్ రావు కుట్రకు తెరతీసినట్టుగా సినిమాలో చూపించారు. పాతబస్తీలో మత కల్లోలాలు జరిగితే ఆ సమయంలో నాదెండ్ల పర్యటించడాన్ని బాబు తప్పుబట్టడం లాంటి సన్నివేశాలు కూడ సినిమాలో ఉన్నాయి. ఎన్టీఆర్ లేకుండానే నాదెండ్ల భాస్కర్ రావు మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేయడాన్ని చంద్రబాబునాయుడు అడ్డుకొనే ప్రయత్నం చేసినట్టుగా సినిమాలో ఉంది.
undefined
ఇదిలా ఉంటే ఏపీలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ వద్దే ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు చంద్రబాబునాయుడు ఫోన్‌లో చేరవేసినట్టుగా సినిమాలో దృశ్యాలు ఉన్నాయి. వీలైనంత త్వరగా అమెరికా నుండి రావాలని చంద్రబాబునాయుడు దగ్గుబాటికి సూచిస్తారు. అయితే ఎన్టీఆర్‌ అమెరికా నుండి రాగానే విమానాశ్రయానికి వచ్చిన నాదెండ్ల భాస్కర్ రావు తనతో పాటు పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల డిమాండ్లు ఇవే అంటూ వినతిపత్రం సమర్పిస్తారు. అయితే ఈసందర్భంగా రాసిన లేఖ ఎన్టీఆర్‌కు ఆగ్రహాన్ని తెప్పించినట్టుగా సినిమాలో సన్నివేశాల్లో ఉంది. దీంతో ఎన్టీఆర్ తన మంత్రివర్గం నుండి నాదెండ్ల భాస్కర్ రావును తప్పిస్తారు.
undefined
దీనికి ప్రతీకారంగా గతంలో ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన కాగితానికి ముందు పేజీలో ఎన్టీఆర్‌పై అవిశ్వాసాన్ని ప్రకటిస్తున్నట్టుగా రాసి గవర్నర్‌ను నాదెండ్ల కలిసినట్టుగా సినిమాలో చూపించారు. ఈ సమయంలో నాదెండ్లకు కాంగ్రెస్ పార్టీ కూడ మద్దతును ప్రకటిస్తోంది. దీంతో నాదెండ్లను సీఎంగా ప్రమాణం చేయాలని గవర్నర్ రాంలాల్ కోరినట్టుగా సినిమాలో ఉంది. గవర్నర్ వద్దకు నాదెండ్ల భాస్కర్ రావు తనతో పాటు కొందరు ఎమ్మెల్యేలను తీసుకొచ్చినట్టుగా చూపించారు. అయితే అసలు ఎమ్మెల్యే కానీ వ్యక్తిని గవర్నర్ వద్దకు పేరేడ్‌కు తీసుకొచ్చినట్టుగా చూపారు.
undefined
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎన్టీఆర్ ఉన్న సమయంలోనే ఆయనను సీఎం పదవి నుండి తప్పుకోవాలని గవర్నర్ రాంలాల్ ఆదేశాలు జారీ చేస్తారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ ఎన్టీఆర్ రాజ్ భవన్‌ వద్ద ఆందోళనకు దిగే ప్రయత్నం చేస్తారు. ఈ సమయంలో ఎన్టీఆర్‌ 15 మంది ఎమ్మెల్యేలతో సహా రాజ్ భవన్‌లోకి అనుమతిస్తారు. కానీ, ఎన్టీఆర్‌ తనతో పాటు 168 మంది ఎమ్మెల్యేలతో రాజ్ భవన్ కు వస్తే 15 మందిని అనుమతిస్తారు. మీకు 15 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని గవర్నర్ అన్నట్టుగా సినిమాలో చూపించారు.
undefined
గవర్నర్ తీరును ఎన్టీఆర్‌తో వచ్చిన ఎమ్మెల్యేలు తప్పుబడతారు. కానీ గవర్నర్ రాంలాల్ నాదెండ్ల భాస్కర్‌రావుతో సీఎంగా ప్రమాణం చేయిస్తారు. ఈ సమయంలో మరోసారి ప్రజల వద్దకు ఎన్టీఆర్ వెళ్తారు.ఈ సమయంలో ఉభయకమ్యూనిష్టు పార్టీలు కూడ ఎన్టీఆర్‌కు అండగా నిలిచినట్టుగా సినిమాలో చూపించారు.తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకొంటూ ఎన్టీఆర్ ఢిల్లీలో తన వాదనను విన్పిస్తారు. రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తుతాయి, దేశంలోని కాంగ్రెసేతర పార్టీలన్నీ కూడ ఎన్టీఆర్‌కు మద్దతుగా నిలిచినట్టుగా ఈ సినిమాలో చూపించారు.
undefined
అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సమయంలో ఆ చర్చ జరగకుండా నాదెండ్ల వేసిన ఎత్తులను టీడీపీ చిత్తు చేసినట్టుగా చూపిస్తారు. నాదెండ్ల వర్గీయులు ఎన్టీఆర్‌తో పాటు టీడీపీ ఎమ్మెల్యేలపై అసభ్యంగా మాట్లాడిన కూడ సహనంతో ఉన్నట్టు చూపించారు. ఎన్టీఆర్‌పై కూడ కొందరు నాదెండ్ల తరపున ఉన్న మహిళ ఎమ్మెల్యేలు రెచ్చగొట్టేలా మాట్లాడిన తీరును కూడ చూపించారు.కానీ, రాష్ట్రంలో ప్రజల ఆందోళనలు ఉధృతం కావడంతో గవర్నర్ రాంలాల్‌ను వెనక్కి పిలిపించి కొత్త గవర్నర్ గా శంకర్ దయాళ్ శర్మను పంపించినట్టు చూపిస్తారు. ఆ సమయంలో అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ నాదెండ్లకు సూచించినట్టుగా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయి.
undefined
ఇదిలా ఉంటే రెండు మూడు దఫాలు అసెంబ్లీని వాయిదా వేసినట్టుగా చూపించారు. అయితే చివరకు ప్రజాభిప్రాయానికి తలొగ్గడంతో మరోసారి ఎన్టీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించినట్టుగా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయి.1984 ఆగష్టు సంక్షోభంలో నాదెండ్ల కీలకంగా పనిచేశారని ఈ సినిమాలో సన్నివేశాలను పొందుపర్చారు. నాదెండ్ల భాస్కర్ రావు అనుమానించినట్టుగా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయి.
undefined
1984 ఆగష్టు సంక్షోభంలో నాదెండ్ల కీలకంగా పనిచేశారని ఈ సినిమాలో సన్నివేశాలను పొందుపర్చారు. నాదెండ్ల భాస్కర్ రావు అనుమానించినట్టుగా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయి.
undefined
click me!