రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేకి కోపమొస్తే...

Published : Dec 01, 2016, 04:04 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేకి కోపమొస్తే...

సారాంశం

అక్వా ఫుడ్ ప్లాంట్ వద్దని నిరసని తెలిపితే ఎమ్మెల్యే గారి ‘ కార్యకర్తలు ’ ఇలా దాడి చేసి అసుపత్రి పాల్చేశారు.

అసలే ఎమ్మెల్యే. అందునా రూలింగ్ పార్టీ.

 

ఆయన చుట్టూ ఉన్నవాళ్లు టు-ఇన్-వన్. సభల్లో ’కార్యకర్త‘ లయిపోతారు, రోడ్ల మీద అల్లరి మూక అవతారం ఎత్తుతారు.

 

అలాంటపుడు ఎమ్మెల్యే పెద్ద మనిషికి కొపమొస్తే ఎలా ఉంటుంది. ఇది ఈ పోటోలో ఉన్న  సముద్రాల సత్యవాణి, పాలి లక్ష్మిల పరిస్థితే వస్తుంది. గాయాలతో దగ్గిర్లో ఉన్న  అసుపత్రిలో చేరాల్సివస్తుంది.

 

ఒక రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే  చట్టు ఉన్న ‘కార్తకర్త’లు ఎమ్మెల్యేకి కోపం రాగనే ఎంత భీభత్సరం సృష్టించారో చూడొండి.

 

నర్సాపురం మండలం కంసాలి బేతపూడి గ్రామానికి చెందిన ప్రజలు చాలా రోజులుగా అక్కడ  నిర్మిస్తున్న అక్వాఫుడ్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. అదొస్తే కాలుష్యంతో తమ బతుకులు బుగ్గిపాలవుతాయని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రదర్శనలు చేశారు. ధర్నాలు చేశారు.

 

ఆ వూరికి ఏ నాయకుడొచ్చినా తమ నిరసన తెలుపుతారు. అపోజిషనోళ్లు వస్తే కలసి మద్దుతు కోరతారు. అధికారపార్టీ వాళ్లొస్తే నిరసన తెలుపుతారు. వారికి అడ్డుపడి తమగోడు చెప్పుకుంటారు. అంతే, అది సాయుధ పోరాటం కాదు. వాళ్లు ఉగ్రవాదులు కాదు, సాదారణ రైతు, మత్స్యకారుల కుటుంబాల గృహిణులే. వాళ్ల చేతుల్లో ఆయుధాలు కూడా లేవు. వాళ్లు గాల్లోకి విసిరేది  ఆఫ్యాక్టరీని అక్కడి నుంచి తరలించండనే నినాదాన్నే.

 

రెండు రోజుల కిందట ఈ వూరికి జన చైతన్య యాత్ర పేరిట నరసాపురం ఎమ్మెల్య బండారు మాధవనాయుడు ‘కార్యకర్త’ లతో వచ్చాడు. వూరి మహిళలలు ఎప్పటిలాగానే అక్వాపార్క్ కు తమ నిరసన తెలిపేందుకు వారి ముందకు వెళ్లారు. నినాదాలిచ్చారు. అంతే,  కార్యకర్తలు తమ అసలు అవతారం చూపించారు.

 

మహిళల మీద దాడి చేశారు.  దాడిలో అనేక మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిని సముద్రాల సత్యవాణి, పాలి లక్ష్మిలను నరసాపురం  ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. మిగతావారిని ప్రాథమిక చికిత్స  చేసి పంపించారు.

 

రొయ్యల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ వద్దనే హక్కు వారికి ఉంది. దీనికోసంవాళ్ళు దాదాపు రెండేళ్లుగా చిన్న చిన్న ఉద్యమాలుచేస్తున్నారు.అయినా ప్రభుత్వం ఫ్యాక్టరీ యాజమాన్యంతోనే ఉంది. కాకపోతే, కాలుష్య నివారణ చర్యలు చేపడతాం అంటున్నారు. వద్దు ఈ ప్లాంటును వూరికి దూరంగా తరలించండనేది వారి డిమాండ్ .

 

దెబ్బలు తిన్న కోపంతో అల్లరి మూకలు వెళ్లిపోయాక, మహిళలు అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకుల పేరు మీద ఉన్న శిలాఫలకం ధ్వంసం చేశారు. బ్యానర్లు చించేశారు. తర్వాతేం చేస్తారు... కేసులు పెడతారు. పెట్టండి, మేంసిద్ధం, అంటున్నారు వూరి మహిళలు.

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?