హైదరాబాద్ నుంచి వెళ్లగొట్టారు...

First Published Nov 30, 2016, 8:18 AM IST
Highlights

అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించి హైదరాబాద్ నుంచి వెళ్ల గొట్టారు అయినా, సరే కొత్త శకం ప్రారంభిస్తున్నా....

అందంగా, అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా నిర్మించుకున్నాక, అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన చేసిన హైదరాబాద్ నుంచి వెళ్లగొట్టారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవేదన చెందారు. ఈ రోజు నుంచి వెలగపూడిలో  కొత్త సెక్రెటేరియట్ లో పూర్తయిన తన కార్యాయలం నుంచి పనిచేయడం ప్రారంభిస్తారు.  ఈ సందర్భంగా ఆయన వెలగపూడి రాగానే ఉద్యోగులు ఘన స్వాగతం  పలికారు. వారి నుద్దేశించి ప్రసగిస్తూ,  తమని హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లగొట్టింది ఆయన వివరించారు. అయినా సరే కొత్త శకం ప్రారంభిస్తున్నా నని చెప్పారు.

 

 సీఎం కార్యదర్సులు సతీష్ చంద్ర, రాజమౌళి, నగర పోలీస్ కమీషనర్ గౌతమ్ సవాంగ్, గుంటూరు జిల్లా పోలీస్ అధికారులు సాదరంగా కొత్త ఛేంబర్ లోకి ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.కొత్త ఛాంబర్ లోకి అడుగు పెట్టిన ముఖ్యమంత్రిని  రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్ అభినందించారు.

 

‘అపుడు హైదరాబాద్ ను ప్రపంచపటంలో కనిపించేలా చేశాను. ఇపుడు అమరావతి ప్రపంచస్థాయికితీసుకుపోతున్నాను. మరొక కొత్త శకం ప్రారంభమవుతూంది. ప్రారంభిస్తున్నాను,’ అని ఆయన ప్రకటించారు.

 

ఇంతవరకు ఆయన కమాండ్ అండ్ కంట్రోల్ రూంలో జరిగే సమావేశాలకే వచ్చే వారు. ఈ రోజు నుంచి తన కార్యాలయం నుంచి విధులు నిర్వర్తిస్తారు. రేపు తొలిక్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆవేశంతో ప్రసంగించారు.

 

‘తెలుగు వారంతా కలిసి ఉండాలని హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని ఆ నగరాన్ని అభివృద్ధి చేసుకున్నాం.  తొమ్మిది సంవత్సరాలు కష్టపడి హైదరాబాద్ ను ప్రపంచపటంలో నిలిపాను. అన్యాయంగా, ఆశాస్త్రీయంగా విభజన చేసి వెళ్లగొట్టారు.రాజకీయ కారణాలతో హేతుబద్దత లేకుండా రాష్ట్ర విభజన చేశారు,’ అంటూ అయినా సరే కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నామని అన్నారు.

 

 

ఇది రెండో మజిలీ : సీఎం

 

‘ప్రపంచం మెచ్చుకునే రాజధాని నిర్మించడమే నా ప్రధమ ప్రాధాన్యం. ప్రపంచంలో ఏ రాజధానికి అమరావతికి ఉన్నన్ని ఆకర్షణలు లేవు. ఒక పక్క కృష్ణా నది, పూర్తి వాస్తు, ఆహ్లాదంగా వుండే పర్వత శ్రేణులు, అంతటా పచ్చదనం అమరావతి సొంతం .ఉద్యోగుల త్యాగాలు ఊరికే పోవు, కష్టాలు, సుఖాలు, ఇబ్బందుల్లో మీతో ఉంటాను,‘ అని అన్నారు.

 

మనమంతా ఒక పెద్ద కుటుంబ అని  ఉద్యోగులతో  అన్నారు.

 

 తర్వాత, అమరావతి పనులను సమీక్షించారు. ఇది అక్కడ జరిగిన తొలిసమావేశం.

 

నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు, రాజధాని నిర్మాణానికి వినియోగించే ప్రతి రూపాయికి ఫలితం వుండాలని ఆయన అన్నారు.

 

రాజధాని చుట్టూ మూడు రింగ్ రోడ్ల నిర్మాణానికి అధికారుల ప్రతిపాదనల వచ్చాయి. అవి:  15 కి.మీ విస్తీర్ణంతో 94.5 కి.మీ. మేర ఇన్నర్ రింగ్ రోడ్డు; 25 కి.మీ. విస్తీర్ణంతో 150 కి.మీ. ఔటర్ రింగ్ రోడ్డు; 34 కి.మీ. విస్తీర్ణంతో 210 కి.మీ. పొడవున రీజినల్ రింగ్ రోడ్డు

 

ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలో రాజధాని నగరంతో సహా 1,36,000 వేల ఎకరాల ప్రాంతం ఉంటుంది.

 

click me!