
నెయ్యి, ఆయిల్, గోధుమపిండి, పసుపు...కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లుగా తయారైంది వ్యాపారస్తుల పని. తాజాగా పై జాబితాలో కారం కూడా చేరింది. అదీ కుడా అలా ఇలా కాదు. వందల టన్నుల కొద్దీ కల్తీ కారం. రాజధానిలో పలు చోట్ల ఈ కల్తీ కారం దందా యధేచ్చగా నడుస్తున్నట్లు సమాచారం. పలుచోట్ల పోలీసులు దాడులు చేసి కల్తీ కారాన్ని స్వధీనం చేసుకోవటం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది.
రాష్ట్రంలోని పలు శీతల గిడ్డంగుల్లో అధికారులు జరుపుతున్న దాడుల్లో వందల కొద్దీ బస్తాల్లో కల్తీ కారం పట్టుపడుతున్నది. తాజాగా రాజధాని తుళ్ళూరు మండలంలోని పొలాల్లో బస్తాల కొద్దీ కల్తీ కారం కనబడింది. అంటే, ఎక్కడా దాచుకునేందుకు అవకాశం లేక, దాడులకు భయపడి వ్యాపారస్తులే తమ వద్ద ఉన్న సరుకును పొలాల్లో పడేసారు.
చాలా చోట్ల అదేవిధంగా కారం బస్తాలు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికి పదుల సంఖ్యలోని శీతల గిడ్డండగులపై జరిపిన దాడుల్లో టన్నుల కొద్దీ కల్తీ కారాన్ని పట్టుకున్నారంటే ఈ కల్తీ దందా ఎప్పటి నుండి నడుస్తోందో.