
ఇపుడు చంద్రబాబునాయడు అండ్ కో ఏమని సమాధానం చెబుతుంది. ఇంతకాలం గుడ్డ కాల్చి మొహానపడేసే విధానంలో ఆరితేరిపోయిన చంద్రబాబు అండ్ కో ఇపుడు అడ్డంగా బుక్కైపోయారు.
ఇదంతా ఎందుకంటే, ఆమధ్య స్వచ్చంధ ఆదాయం వెల్లడి పథకంలో హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి రూ. 10 వేల కోట్లు ఆదాయం వెల్లడించారని ప్రచారం జరిగింది. వెంటనే సదరు వ్యక్తి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అంటూ టిడిపి రాగం అందుకున్నది.
ఎటువంటి ఆధారాలు లేకపోయినా ముఖ్యమంత్రి స్ధాయిలో ఉన్న చంద్రబాబు జగన్ అన్న అర్ధం వచ్చేలా మొదట ఆరోపణలు మొదలుపెట్టారు. ఆ తర్వాత మంత్రుల భజన బృందంలో సభ్యులైన దేవినేని ఉమా మహేశ్వర్ రావు, పల్లె రఘునాధరెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు తదితరులు కూడా జగన్ పై గుడ్డకాల్చి మీదేసారు. రూ. 10 వేల కోట్లు కట్టింది జగనే అంటూ ఊదరగొట్టారు.
వారి భజనకు వారికి వత్తాసు పలికే మీడియా కూడా పూర్తిగా మద్దతు పలికింది. అయితే, ఆ ఆరోపణలను ఖండించిన వైసీపీ ప్రకటనలను మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. అయితే, తాజాగా వెలుగు చూసిన అంశమేమిటంటే రూ. 10 వేల కోట్ల ఆదాయం ఉందని చెప్పిన వ్యక్తి ఓ అనామకుడు. ప్రచారం కోసమే అలా చెప్పాడు.
అతని పేరు బాణాపురం లక్ష్మణరావు. అతనికి, జగన్ కు ఎటువంటి సంబంధమూ లేదు. మరి, ఏధారాలతో జగన్ పై ఆరోపణలు చేసారో చెప్పాల్సిన బాధ్యత మంత్రులపై ఉంది. అసలు చంద్రబాబు లాంటి 40 ఇయర్స్ ఇండస్ట్రీనే ఆ విధంగా ముందు వెనుకా చూడకుండా నోటికి వచ్చిన ఆరోపణలు చేస్తుంటే భజన బృదం ఎందుకు చూస్తు ఊరుకుంటుంది?