అక్కడేం మాట్లాడినా వేలు లక్షల కోట్లే...

Published : Dec 07, 2016, 10:18 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
అక్కడేం మాట్లాడినా వేలు లక్షల కోట్లే...

సారాంశం

ఆంధ్ర పాలకులు తెలసిన భాష ఒక్కటే.... ఏమ్మాట్లాడినా వేల కోట్లు, లక్షల కోట్లే.

ఆంధ్రలోగాని, అమరావతి వర్ల్డ్ క్లాస్ సిటి లో గాని అక్కడ వినిపించేమాటలన్నీ లక్షల కోట్లే.

 

ఆ మధ్య వైజాగ్ఇన్వెస్టమెంట్ సమిట్ జరిగింది. అక్కడికి వచ్చిన పెద్ద మనుషులు రాష్ట్రానికి హా మీ ఇచ్చినపెట్టుబడులు అరు లక్షల కోట్లు. వీటి వల్ల అయిదారు లక్షల ఉద్యోగాలొస్తాయని ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు చెప్పారు.

 

తర్వాత, కొత్తరాజధాని అమరావతి నిర్మాణానికి రు. అయిదు లక్షల కోట్లు కావాలని కేంద్రాన్ని అడిగారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ తెలంగాణా కు పోయిందని చెబుతూ  రు.13.2 లక్షల కోట్ల సహాయం కావాలని కేంద్రాన్ని కోరారు. తర్వాత  రాజధాని కోర్ క్యాపిటల్ నిర్మాణానికి రు. 28,097 కోట్లు ఖర్చవుతాయని చెప్పారు. ఆ పైన రు. 28,097 కోట్ల రాజధానిలో రోడ్లు వేసేందుకు రు. 30,000 కోట్లు కావాలన్నారు.

 

ఇపుడు రాజధానిలో ఇళ్లు నిర్మించుందుకు 1,00,000 కోట్లు కావాలంటున్నారు. గృహ, వాణిజ్య సముదాయాల నిర్మాణానికి కనీసం రూ. లక్ష కోట్లను సమీకరించేందుకు క్యాపిటల్ రీజియన్ డెవెలప్ మెంట్ అధారిటీ (సిఆర్ డిఎ) మార్గాలను అన్వేషిస్తున్నది.

 

బ్యాంకులతో ఒక విడత జరిగింది. ఇందులో పెద్దగా స్పందన రాలేదని తెలసింది. బ్యాంకర్ల అనుమానాలు నివృత్తి చేసేందుకు తొందర్లో రెండో సమావేశం ఏర్పాటు చేయాలని సిఆర్‌డిఎ ఆలోచిస్తావుంది.

 

రాజధాని ప్రాంతంలో డెవెలప్ చేసిన భూమిని రైతులకు ఇస్తే అక్కడ సుమారు 65 కోట్ల చదరపు అడుగుల నిర్మాణానికి వీలవుతుందట.  అందులో 6.50 లక్షల ఇళ్లు కట్టేందుకు అవకాశం ఉంది. ముందుగా రైతులు ఇచ్చిన భూమిని డెవలప్ చేసేందుకు ఎకరానికి కోటి రుపాయలు ఖర్చువుతుందని ఒక లెక్క వేశారు. దీని ప్రకారం రైతుల నుంచి సమీకరించిన 35 వేల ఎకరాలకు రు. 35 వేల కోట్ల ఖర్చువుతాయి. ఇళ్ల నిర్మాణంలో చ.అడుగుకు రు. 1700 రుపాయలు ఖర్చవుతాయని మరొక అంచాన. 

 

ఈలెక్కన రాజధానిలో రైతులకు ఇళ్లకు రూ.1,10,500 కోట్లు అవసరమట . ఇందులోరైతుల వద్ద కనీసం రూ.10వేల కోట్లున్నా ఇంకా రూ.1,05000 కోట్లు వసరమవుతుంది. ఇవి కాకుండా పేదల ఇళ్ల కోసం 2500 ఎకరాలుకేటాయిస్తామని హామీ ఇచారు. కానీ ప్లాన్లో అదెక్కడో చూపించ లేదు.  ఈ ఇళ్ల కు సుమారు రూ.42 వేల కోట్లు ఖర్చు మరొక అంచనా.

 

ఈ లక్షల కోట్ల వ్యవహారం చూస్తే  అమరావతిలో వెలగపూడి టెంపొరరీ ( కట్టిందేమో పక్కా బిల్డింగ్)క్యాపిటల్ తప్ప ఇళ్ల కట్టుకోవడం సాధారణ ప్రజలు నివసించడం కనుచూపు మేరలో జరగదమో అనిపిస్తుంది. అయినా సరే, అక్కడ మెట్రో రైలు కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారట.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?