ప్రత్యేక హోదాయే కావాలి

Published : Dec 07, 2016, 10:12 AM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
ప్రత్యేక హోదాయే కావాలి

సారాంశం

 రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజి వల్ల ఎటువంటి ఉపయోగం లేదని కాబట్టి హోదాయే ఇవ్వాలని స్పష్టం చేసారు.

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ఎంపిలు ప్రత్యేకహోదా కోసం నినదించారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా బుధవారం వైసీపికి చెందిన ఎంపిలు రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ నినాదాలు చేసారు. ఈ అంశంపై ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఏపికి ప్రత్యేకహోదా కల్పించి తీరాల్సిందేనంటూ డిమాండ్ చేసారు.

 

 రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజి వల్ల ఎటువంటి ఉపయోగం లేదని కాబట్టి హోదాయే ఇవ్వాలని స్పష్టం చేసారు. తాము అధికారంలోకి వస్తే ఐదేళ్లు కాదు పదేళ్ల పాటు రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పిన కేంద్రమంత్రి వెంకయ్యనాయడు ఎందుకని ఇపుడు హోదాపై మొహం చాటేస్తున్నారని నిలదీసారు. అదే సందర్భంలో తమకు ప్రత్యేక ప్యాకేజి కన్నా ప్రత్యేకహోదాయే కావాలంటూ మరో ఎంపి బుట్టా రేణుక కూడా డిమాండ్ చేసారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?