నాలుగు సర్వేలు చేయించా, విజయం మనదే: చంద్రబాబు

Published : May 13, 2019, 05:11 PM ISTUpdated : May 13, 2019, 05:14 PM IST
నాలుగు సర్వేలు చేయించా, విజయం మనదే: చంద్రబాబు

సారాంశం

ఏపీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు నాలుగు సంస్థలతో సర్వే నిర్వహించారు.ఈ సంస్థలు నిర్వహించిన సర్వే ఫలితాల్లో టీడీపీ విజయం ఖాయమని తేలిందని  ఆ పార్టీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రకటించారు.


అమరావతి:ఏపీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు నాలుగు సంస్థలతో సర్వే నిర్వహించారు.ఈ సంస్థలు నిర్వహించిన సర్వే ఫలితాల్లో టీడీపీ విజయం ఖాయమని తేలిందని  ఆ పార్టీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రకటించారు.

సోమవారం నాడు అమరావతిలో నిర్వహించిన నంద్యాల, కర్నూల్ పార్లమెంటరీ  నియోజకవర్గాలపై చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ నాలుగు సర్వేల్లో కూడ టీడీపీ విజయం ఖాయమని తేలిందని ఆయన  ప్రకటించారు. ఈ సమావేశంలో ఈ విషయాన్ని బాబు  స్పష్టం చేశారు.

ఎన్నికల కౌంటింగ్ రోజున పోలింగ్ ఏజెంట్లు ఎలా ఉండాలనే దానిపై చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. నంద్యాల, కర్నూల్ ఎంపీ స్థానాల్లో టీడీపీ విజయం సాధించనుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. మే 23న కౌంటింగ్‌లో టీడీపీ గెలుపు లాంఛనమేనని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. 

మరోసారి మోడీ ప్రధాని అయ్యే అవకాశమే లేదన్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై ఐదేళ్ల నుండి పోరాటం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.వైసీపీ అనేక దుర్మార్గాలకు పెట్టింది పేరని ఆయన విమర్శలు చేశారు. ఓడిపోతామని భయంతోనే వైసీపీ, వైసీపీలు మాట మార్చారని ఆయన చెప్పారు.
 

PREV
click me!

Recommended Stories

MLA Viral Video: ఎమ్మెల్యే రాస‌లీలలు.? ఈ వీడియోలో ఉంది నిజంగానే జ‌న‌సేన నాయ‌కుడా.?
IMD Rain Alert : కేరళ తీరంలో అల్పపీడనం... ఈ ప్రాంతాల్లో వర్షాలు