నాలుగేళ్ల ప్లాన్: పవన్‌తో చర్చలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ ఆసక్తికర వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Jan 16, 2020, 10:35 AM IST
Highlights

వచ్చే నాలుగేళ్ల పాటు కలిసి పనిచేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నట్టుగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు.

అమరావతి: 2024 వరకు బీజేపీ, జనసేనలు ఎలా కలిసి పని చేయాలనే దానిపై చర్చించనున్నట్టుగా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ  జీవీఎల్ నరసింహారావు చెప్పారు.గురువారం నాడు విజయవాడలో జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థలు,  అమరావతి అంశాలే తమ మధ్య ప్రధాన ఎజెండా కాదని జీవీఎల్ నరసింహారావు చెప్పారు.

Also read: వైఎస్ జగన్ పై ఫైట్: బిజెపి నేతలతో పవన్ కల్యాణ్ భేటీపై ఉత్కంఠ

ఈ రెండు పార్టీలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఎలా కలిసి ముందుకు వెళ్లాలనే విషయమై చర్చించనున్నట్టుగా పవన్ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు.రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలపై రెండు పార్టీల మధ్య చర్చించనున్నట్టుగా జీవీఎల్ నరసింహారావు చెప్పారు.

Also Read: 16న భేటీ: బీజేపీతో కలిసి జగన్ పై పోరుకు పవన్ కల్యాణ్ వ్యూహరచన

గురువారం నాడు విజయవాడలోని ఓ హటల్‌లో జనసేన, బీజేపీ నేతల మధ్య సమావేశం జరగనుంది. జనసేన తరపున పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహార్, బీజేపీ తరపున సునీల్ దియోధర్, జీవీఎల్ నరసింహారావు, కన్నా లక్ష్మీనారాయణలు హాజరుకానున్నారు.

Also Read: జగన్ మీద ఫైట్: బిజెపి అస్త్రం పవన్ కల్యాణ్, చంద్రబాబు వెనక్కి

ఈ రెండు పార్టీలు భవిష్యత్తులో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ కార్యాలయంలో జీవీఎల్ నరసింహారావు, కన్నా లక్ష్మీనారాయణ, సునీల్ దియోధర్‌లు ముందుగా పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు.

also read:అమరావతి: విశాఖకు రాజధాని తరలించొద్దంటూ సీఆర్‌డీఏకు రైతుల అభ్యంతరాలు

click me!