దివ్యతేజ హత్య: ఏడు రోజుల్లో ఛార్జీషీట్ దాఖలు చేస్తామన్న డీజీపీ సవాంగ్

By narsimha lodeFirst Published Oct 16, 2020, 2:35 PM IST
Highlights

ఇంజనీరింగ్ విద్యార్ధిని దివ్యతేజ మృతి ఘటనపై వారం రోజుల్లో ఛార్జీషీట్ దాకలు చేస్తామని ఏపీ డీజీపీ గౌతంసవాంగ్ తెలిపారు.


విజయవాడ: ఇంజనీరింగ్ విద్యార్ధిని దివ్యతేజ మృతి ఘటనపై వారం రోజుల్లో ఛార్జీషీట్ దాకలు చేస్తామని ఏపీ డీజీపీ గౌతంసవాంగ్ తెలిపారు.

ఈ నెల 15వ తేదీన దివ్యతేజపై నాగేంద్రబాబు దాడి చేయడంతో ఆమె ఆసుపత్రిలో చనిపోయింది. అయితే తాను ఆమెపై దాడి చేయలేదని... ఇద్దరం చనిపోవాలని భావించి ఆత్మహత్యాయత్నం చేశామని నాగేంద్రబాబు చెప్పారు.

also read:మా కూతురిని చంపినట్టే అతడిని చంపండి: నాగేంద్ర కామెంట్స్ పై దివ్య పేరేంట్స్

బాధితురాలి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి ఉన్మాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. సీపీ పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తు జరిగేలా చూడాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా ఆయన తెలిపారు.

చిన్నారులపై, మహిళలపై దాడులకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ శాఖ ఉపేక్షించదన్నారు. సమాజంలో జరుగుతున్న వింత పోకడలను అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారాయన.


దివ్యతేజను తాను రహస్యంగా పెళ్లి చేసుకొన్నట్టుగా నాగేంద్రబాబు ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు. ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు కూడ తెలుసునని ఆయన చెప్పారు.ఈ పెళ్లి దివ్య పేరేంట్స్ కు ఇష్టం లేదన్నారు. ఇద్దరం కలిసి చనిపోవాలని భావించి ఎవరి గొంతు వాళ్లే కోసుకొన్నామని ఆయన చెప్పారు. నాగేంద్ర చెప్పిన విషయాలను దివ్యతేజ పేరేంట్స్ కొట్టిపారేశారు.  ఈ కేసు నుండి తప్పించుకొనేందుకు పెళ్లి చేసుకొన్నట్టుగా నాగేంద్ర తప్పుడు ప్రచారం చేస్తున్నాడని దివ్య కుటుంబసభ్యులు చెబుతున్నారు. 

click me!