పీఆర్సీపై రెండు మూడు రోజుల్లో ప్రకటన: ఉద్యోగ సంఘాలతో ముగిసిన జగన్ భేటీ

By narsimha lode  |  First Published Jan 6, 2022, 3:21 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీ విషయమై ఏపీ రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యారు. ఏపీలోని ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన డిమాండ్లు కూడా సీఎం దృష్టికి తీసుకొచ్చారు.


అమరావతి: prcపై రెండు మూడు రోజుల్లో ప్రకటన చేయనున్నట్టుగా ఏపీ సీఎం Ys Jagan ప్రకటించారు.ఉద్యోగ సంఘాలతో ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారం నాడు మధ్యాహ్నం సమావేశమయ్యారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని ఉద్యోగ సంఘాలు సీఎంతో సమావేశానికి హాజరయ్యాయి.  ప్రాక్టికల్ గా ఆలోచించాలని Employees సంఘాలను సీఎం  వైఎస్ జగన్ కోరారు.ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను స్వయంగా నోటు చేసుకొన్నానని జగన్ తెలిపారు. అన్నింటిని స్ట్రీమ్‌లైన్ చేయడానికి అడుగులు ముందుకేస్తామని జగన్ తేల్చి చెప్పారు.

మెరుగైన పీఆర్సీని ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపకుండా ఆలోచించాలని జగన్ ఉద్యోగ సంఘాలను కోరారు. ఉద్యోగులకు మంచి చేయాలనే తపనతో ఉన్నానని సీఎం జగన్ చెప్పారు.

Latest Videos

ఉద్యోగ సంఘాల నేతలు 45 నుండి 55 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని ఈ సమావేశంలో కోరినట్టుగా సమాచారం. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రాక్టికల్ గా ఆలోచించాలని సీఎం కోరినట్టుగా తెలుస్తోంది.. సీఎంతో సమావేశానికి ముందే ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు సమావేశమయ్యారు. సీఎంతో జరిగే సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై  చర్చించారు. సుమారు నెల రోజుల నుండి పీఆర్సీ విషయమై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాల మధ్య చర్చలు సాగుతున్నాయి. కానీ పీఆర్సీ  విషయమై ఇంకా స్పష్టత రాలేదు.ఇవాళ జరిగిన సమావేశంలో కూడా పీఆర్సీపై స్పష్టత రాలేదు. 

also read:ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ భేటీ: పీఆర్సీపై రానున్న స్పష్టత

గత ఏడాది చివర్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా తిరుపతిలో జగన్ పర్యటించిన సమయంలో  పీఆర్సీపై ఏపీ సీఎం జగన్ ను ఉద్యోగ సంఘాల నేతలు దృష్టికి తీసుకొచ్చారు. పీఆర్సీ ప్రక్రియ ప్రారంభమైంది, వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. అయితే ఆ తర్వాత పీఆర్సీపై నిపుణుల కమిటీ నివేదికను సీఎంకు ఇచ్చారు. అయితే పీఆర్సీపై నిపుణుల కమిటీ 14.29 శాతం ఫిట్ మెంట్ ను ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు అంగీకరించడం లేదు.

 ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్న మేరకు పీఆర్సీ ఫిట్‌మెంట్  ఇస్తే ఏ మేరకు ఆర్ధిక శాఖపై భారం పడనుందనే విషయమై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహదారు, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు కూడా ఉద్యోగ సంఘ నేతలతో జరిగిన చర్చల వివరాలను సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఫిట్‌మెంట్ విషయమై ఆలోచించాలని కూడా ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వ పెద్దలు సూచించారు.

పీఆర్సీ ఫిట్‌మెంట్ పై  స్పష్టత రావడానికి మరో రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉంది.అయితే ఉద్యోగ సంఘాలతో మరోసారి సీఎం సమావేశమౌతారా లేదా అనేది కూడా తేలాల్సి ఉంది. పీఆర్సీ విషయంలో  ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్ మేరకు పీఆర్సీని ప్రకటిస్తుందా లేదా అనేది కూడా రెండు మూడు రోజుల్లో తేలనుంది.


 

click me!