ఏపీ సీఎం వైఎస్ జగన్ తో ఉద్యోగ సంఘాల నేతలు బేటీ అయ్యారు. పీఆర్సీ ఫిట్‌మెంట్ పై ఉద్యోగ సంఘాల నేతలు గురువారం నాడు భేటీ అయ్యారు.
అమరావతి: prc పై జాయిట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని Employees సంఘాల నేతలు సీఎం Ys Jagan తో గురువారం నాడు భేటీ అయ్యారు. పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పీఆర్సీ విషయమై కనీసం 55 శాతం ఇవ్వాలని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కోరుతున్నారు. సీఎంతో సమావేశానికి ముందే ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు సమావేశమయ్యారు. సీఎంతో జరిగే సమావేశంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఆర్ధికపరమైన అంశాలతో పాటు ఆర్ధికేతర అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
సీఎంతో జరిగే సమావేశంలోనే పీఆర్సీపై తాడో పేడో తేల్చుకోవాలని కూడా ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయంతో ఉన్నారు. ఉద్యోగ సంఘాలకు ఉదారంగా పీఆర్సీని ఖరారు చేసేందుకు సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని కూడా ప్రభుత్వ వర్గాల నుండి సంకేతాలు ఇచ్చారు. అయితే ఆ మేరకు రాస్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి సహకరించడం లేదని కూడా ప్రభుత్వ పెద్దలు ఉద్యోగ సంఘాల నేతల దృష్టికి తీసుకొచ్చారు.
also read:పీఆర్సీపై వీడని సస్పెన్షన్.. ముగిసిన జగన్ సమీక్ష, రేపు ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ
సుమారు నెల రోజుల నుండి పీఆర్సీ విషయమై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాల మధ్య చర్చలు సాగుతున్నాయి. కానీ పీఆర్సీ విషయమై ఇంకా స్పష్టత రాలేదు. రాస్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు sajjala Ramakrishna Reddy, ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి Buggana rajendranath reddy ఉద్యోగ సంఘాల నేతలకు వివరించారు. ఉద్యోగులకు పీఆర్సీ ఫిట్‌మెంట్ విషయమై కార్యదర్శుల కమిటీ ఇచ్చిన 14.29 ఫిట్‌మెంట్ ను తాము అంగీకరించబోమని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. 27 శాతానికి పైగా ఫిట్‌మెంట్ ఉంటేనే చర్చలకు వస్తామని కూడా సీఎస్ Sameer Sharma కు ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు.
గత ఏడాది చివర్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా తిరుపతిలో జగన్ పర్యటించిన సమయంలో పీఆర్సీపై ఏపీ సీఎం జగన్ ను ఉద్యోగ సంఘాల నేతలు దృష్టికి తీసుకొచ్చారు. పీఆర్సీ ప్రక్రియ ప్రారంభమైంది, వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. అయితే ఆ తర్వాత పీఆర్సీపై నిపుణుల కమిటీ నివేదికను సీఎంకు ఇచ్చారు. అయితే పీఆర్సీపై నిపుణుల కమిటీ 14.29 శాతం ఫిట్ మెంట్ ను ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు అంగీకరించడం లేదు.
ఇవాళ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశానికి ముందుగా ఆర్ధిక శాఖ ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్న మేరకు పీఆర్సీ ఫిట్‌మెంట్ ఇస్తే ఏ మేరకు ఆర్ధిక శాఖపై భారం పడనుందనే విషయమై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహదారు, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు కూడా ఉద్యోగ సంఘ నేతలతో జరిగిన చర్చల వివరాలను సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఫిట్‌మెంట్ విషయమై ఆలోచించాలని కూడా ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వ పెద్దలు సూచించారు.