చిత్తూరు జిల్లా బాకరాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు.
తిరుపతి: Chittoor జిల్లాలోని Bakarapeta ghat road రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఏపీ రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి Peddireddy Ramachandra Reddy ఆదివారం నాడు పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును క్షతగాత్రులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సహాయం అందించాలని మంత్రి వైద్యులను ఆదేశించారు. బాకరాపేట ఘాట్ రోడ్డు వద్ద రెయిలింగ్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఆదివారం నాడు తెల్లవారుజామున బాకరాపేట ఘాట రోడ్డులో ప్రైవేట్ Bus అదుపు తప్పి లోయలో పడింది.ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా, 55 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని అర్ధరాత్రిపూట Tirupati లోని Ruia ఆసుపత్రికి తరలించారు. రుయా ఆసుపత్రిలో బాధితులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ పరామర్శించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారికి రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. అంతేకాదు క్షతగాత్రులకు రూ. 50 వేలు ఇస్తామని కూడా ఏపీ సీఎం జగన్ హామీ ఇచ్చారు.
undefined
Anantapuram జిల్లా Dharmavaram పట్టణానికి చెందిన Venuకు చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి చెందిన యువతితో పెద్దలు వివాహం నిశ్చయించారు. ఇవాళ నిశ్చితార్ధం చేసుకోవాలని రెండు కుటుంబాలు నిర్ణయం తీసుకొన్నాయి. నిశ్చితార్ధానికి ప్రైవేట్ బస్సులో యువకుడి కుటుంబం ధర్మవరం నుండి చిత్తూరు జిల్లా నారాయణవనానికి బయలుదేరింది.
అతి వేగంతోనే ప్రమాదం
బాకరాపేట ఘాట్ రోడ్డులో ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా రవాణాశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఘాట్ రోడ్డు మలుపు తిరిగే సమయంలో బస్సు వేగాన్ని డ్రైవర్ అదుపు చేయలేకపోయినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. దీంతోనే బస్సు అదుపు తప్పి లోయలో పడింది. దీంతో బస్సులో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. బస్సులో ఉన్న 55 మందిని అతి కష్టం మీద బయటకు తీసి రుయా ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో గాయపడిన ఐదుగురు లోయ నుండి అతి కష్టం మీద బయటకు వచ్చారు. వారు ఈ మార్గంలో వెళ్తున్న వాహనాలకు సమాచారం ఇచ్చారు. దీంతో సమీపంలోని చెక్‌పోస్టు వద్ద వాహనదారులు సమాచారం ఇచ్చారు. చెక్ పోస్టు వద్ద పనిచేసే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే తిరుపతి అర్బన్ పోలీసులు ప్లాష్ లైట్ల వెలుగులో క్షతగాత్రులను లోయ నుండి బయటకు తీసుకొచ్చారు.
ఓ రోప్ సహాయంతో పోలీసులు క్షతగాత్రులను 300 అడుగుల లోతులో ఉన్న లోయ నుండి పైకి తీసుకొచ్చారు. సకాలంలో పోలీసులు స్పందించిన కారణంగానే ప్రాణ నష్టం ఎక్కువ వాటిల్లలేదు. బస్సు గాల్లోనే పల్టీలు కొట్టి నేరుగా లోయపడింది. కానీ లోయలో పల్టీలు కొడితే ప్రాణ నష్టం ఎక్కువగా ఉండేదనే అభిప్రాయాలు లేకపోలేదు. బస్సు టాప్ భాగం ప్రయాణీకుల తలలకు తాకడంతో ఎక్కువగా గాయాలయ్యాయి. మరో వైపు బస్సు డీజీల్ ట్యాంక్ నుండి డీజీల్ లీకైంది. కానీ అదృష్టవశాత్తు బస్సుకు నిప్పు అంటుకోలేదు. ఒకవేళ అదే జరిగితే భారీగా ప్రాణ నష్టం జరిగేది.