పోలవరం ప్రాజెక్టును 2023 ఖరీఫ్ సీజన్ నాటికి పూర్తి చేస్తామని ఏపీ సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఇవాళ ఏపీ అసెంబ్లీలో పోలవరంపై జరిగిన చర్చపై సీఎం జగన్ మాట్లాడారు.
అమరావతి:Polavaram projectప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ఏపీ సీఎం YS Jagan చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఒక్క ఇంచు కూడా తగ్గించబోమని ఆయన పునరుద్ఘాటించారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తెచ్చుకున్నారని జగన్ ఆరోపించారు.
మంగళశారం నాడు AP Assembly పోలవరంపై జరిగిన చర్చలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. 2023 ఖరీఫ్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
పోలవరం ప్రాజెక్టు పనులను ఇంత వేగంగా చేస్తున్నా కూడా ఇంతవరకు తాము ఇంతవరకు బస్సులు పెట్టలేదు, భజనలు చేయించలేదని జగన్ సెటైర్లు వేశారు. పోలవరం ప్రాజెక్టును YSR ప్రారంభించారన్నారు. ఆ తండ్రికి కొడుకుగా ఈ ప్రాజెక్టును తాను పూర్తి చేస్తానని జగన్ స్పష్టం చేశారు.అంతేకాదు పోలవరం వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం కూడా ఏర్పాటు చేస్తామని జగన్ ప్రకటించారు.
ప్రాజెక్టు డిజైన్లు అనుమతి CWC నుండి వస్తే ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేస్తామన్నారు. ఈ నెలఖారు నాటికి డిజైన్ అనుమతులు ఇస్తామని కేంద్రం కూడా హామీ ఇచ్చిందన్నారు.
తాము చేయలేని పనిని ఇంకొకరు చేస్తున్నారని చంద్రబాబుకు కడుపు మంటగా ఉందన్నారు సీఎం.తన స్వంత జిల్లాలో కూడా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేని వ్యక్తి Chandrababu అంటూ జగన్ విమర్శించారు.
చంద్రబాబు తప్పిదాలతోనే పోలవరం ప్రాజెక్టుకు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. చంద్రబాబు చెప్పుకోవడానికి కూడా ఒక్క ప్రాజెక్టు కూడా లేదని జగన్ చెప్పారు. పునరావాసంతో ఇతర విషయాలను పట్టించుకోకుండానే కాపర్ డ్యామ్ ను చేపట్టారని జగన్ విమర్శించారు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారని ఓ వర్గం మీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు మాత్రం తగ్గదన్నారు. కానీ చంద్రబాబు ఎత్తు మాత్రం తగ్గుతుందని ఆయన చెప్పారు. రోజు రోజుకు చంద్రబాబు ఎత్తు తగ్గి మరుగుజ్జు అవుతాడన్నారు. 2019 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు గట్టిగా బుద్ది చెప్పారని జగన్ గుర్తు చేశారు.అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా టీడీపీ ఓటమి పాలైందన్నారు. 2024 ఎన్నికల్లో కుప్పంలో కూడా చంద్రబాబు ఓటమి పాలౌతారని జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
తాను విజనరి అని చెప్పుకొనే చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టును తన చేతుల్లోకి తీసుకున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. 2013-14 ప్రాజెక్టు అంచనాల మేరకు ప్రాజెక్టు కడతామని చంద్రబాబు సర్కార్ గతంలో కేంద్రంతో ఒప్పందం చేసుకొందన్నారు.ఈ విషయాన్ని తాను విపక్షనేతగా ఉన్న సమయంలో కూడా నిలదీసినట్టుగా జగన్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా అప్పట్లో తాను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ ను జగన్ అసెంబ్లీలో ప్రదర్శించారు.
;పోలవరం ప్రాజెక్టును ప్రజలకు చూపేందుకు గాను రూ. 100 కోట్లు ఖర్చు చేశారని జగన్ విమర్శించారు. ఈ మేరకు చంద్రబాబును పొగుడుతూ పోలవరంలో మహిళలు పాడిన పాటలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ లను కూడా జగన్ అసెంబ్లీలో చూపించారు.
స్పిల్ వే పూర్తి చేశామన్నారు. అప్రోచ్ చానెల్ ను కూడా పూర్తి చేశామన్నారు. ప్రాజెక్టుకు 48 రేడియల్ గేట్లను కూడా అమర్చామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వీడియోను సీఎం జగన్ అసెంబ్లీలో చూపారు.