తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..

Published : Mar 22, 2022, 02:23 PM IST
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ప్రత్తిపాడు వద్ద జాతీయ రహదారిపై బైక్‌ను వ్యాన్ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు.   

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు వద్ద జాతీయ రహదారిపై బైక్‌ను వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ప్రమాదం అనంతరం బైక్‌ను వ్యాన్ కొద్ది దూరంగా లాక్కెళ్లినట్టుగా సమాచారం. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారు ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి వాసులుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఇక, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇక, తెలంగాణలోని మేడ్చల్ జిల్లా పేట్‌బషీరాబాద్ పరిధి‌లో మంగళవారం తెల్లవారుజామున దారుణం చోటుచేసకుంది. నిద్రిస్తున్న కార్మికులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందారు. మృతిచెందిన వారిని బిహార్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులుగా గుర్తించారు. వివరాలు.. పేట్‌బషీరాబాద్ పరిధి గోదావరి హోమ్స్‌లో నిర్మాణంలో ఉన్న భవనం ముందు బిహార్ రాష్ట్రానికి చెందిన చందన్ రామ్, కుమార్ సహరిలు నిద్రిస్తున్నారు. అయితే మంగళవారం తెల్లవారుజామున భవనం వద్దకు స్టీల్ లోడ్‌తో ఓ లారీ వచ్చింది.

అయితే అక్కడ కార్మికులు నిద్రిస్తున్న విషయం గమనించకుండా డ్రైవర్.. లారీని వెనక్కి పోనిచ్చారు. దీంతో లారీ చక్రాలు అక్కడ నిద్రిస్తున్న కార్మికుల పై నుంచి వెళ్లాయి. దీంతో చందన్ రామ్, కుమార్‌లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chandrababu, Lokesh కి వెంకన్న ప్రసాదం ఇచ్చిన టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ | Asianet News Telugu
నారావారిపల్లెలో CM Chandrababu Family గంగమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు | Asianet News Telugu