విశాఖ ఉక్కు ఫ్యాక్టరీప్రైవేటీకరణను నిరసిస్తూ ఏపీ బంద్‌కు మద్దతు: పేర్ని నాని

By narsimha lode  |  First Published Mar 4, 2021, 3:27 PM IST

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి ఈ నెల 5వ తేదీన రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది.ఈ బంద్ కు ఏపీ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టుగా ఏపీ మంత్రి పేర్నినాని  తెలిపారు.
 


అమరావతి: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి ఈ నెల 5వ తేదీన రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది.ఈ బంద్ కు ఏపీ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టుగా ఏపీ మంత్రి పేర్నినాని  తెలిపారు.

గురువారం నాడు మంత్రి పేర్నినాని అమరావతిలో మీడియాతో మాట్లాడారు. బంద్ కు మద్దతుగా రేపు మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులను బంద్ చేస్తున్నామని ఆయన చెప్పారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఆర్టీసీ కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తారన్నారు.

Latest Videos

తెలుగువాళ్ల పోరాట ఫలితమే విశాఖ ఉక్కు అని ఆయన గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రజల ఆస్తిగానే ఉండాలనేది  వైసీపీ డిమాండ్ గా ఆయన ఆయన చెప్పారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రైవేటీకరణ చేయాలనే  కేంద్రం నిర్ణయం సరైంది కాదన్నారు.నష్టాల పాలు కాకుండా ఉండేందుకు స్టీల్ ప్లాంట్ విషయంలో  తీసుకొంటే లాభాల బాటలో సాగుతోందని ఆయన చెప్పారు. ప్రజల ఆస్తిగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే తాము ఆర్టీసీని ప్రభుత్వపరం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
 

click me!