జనవాణిలో ఫిర్యాదులు, వాలంటీర్లపై కోపం లేదు: పవన్ కళ్యాణ్

By narsimha lode  |  First Published Jul 11, 2023, 2:55 PM IST

వాలంటీర్లంటే తనకు  కోపం లేదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు.  రెండు  రోజుల క్రితం  వారాహి యాత్రలో  పవన్ కళ్యాణ్  వాలంటీర్ల విషయమై  వివాదాస్పద వ్యాఖ్యలు  చేశారు. 


ఏలూరు: వాలంటీర్లపై తనకు  కోపం లేదని  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థపై  పవన్ కళ్యాణ్  వివాదాస్పద వ్యాఖ్యలు  చేశారు.   ఏలూరు జిల్లాలో  సాగుతున్న వారాహి యాత్రలో   మహిళల అక్రమ రవాణలో  వాలంటీర్లు కారణమౌతున్నారని  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రెండు  రోజుల క్రితం వ్యాఖ్యానించారు.  ఈ వ్యాఖ్యలు  ఏపీ రాజకీయాల్లో  దుమారం రేపుతున్నాయి. 

మంగళవారంనాడు  దెందులూరులో  పవన్ కళ్యాణ్ జనసేన నేతలతో  సమావేశమయ్యారు.   ఈ సమావేశంలో  వాలంటీర్ల వ్యవస్థపై  మరోసారి వ్యాఖ్యలు  చేశారు.
వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు  దేశం ఆగిపోలేదన్నారు. వాలంటీర్ల  పొట్టకొట్టాలని తనకు  లేదన్నారు.  జనవాణిలో వాలంటీర్లపై తనకు అనేక ఫిర్యాదులు అందాయన్నారు. 
 ఆడపిల్లల్ని వాలంటీరు యువకులు ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.

Latest Videos

undefined

ఈ విషయమై  ఆడపిల్లల తల్లిదండ్రులు  తమకు  జనవాణిలో ఫిర్యాదు  చేశారన్నారు.  ప్రతి 50 ఇళ్ల కంప్లీట్ డేటా   వాలంటీర్ల  చేతుల్లోకి వెళ్తే ఎలా అని ఆయన  ప్రశ్నించారు. ప్రతి ఇంట్లో రహస్యాలు అనేవి ఉంటాయన్నారు.ప్రతి ఇంట్లో గుట్టు వాలంటీర్లు తెలుసుకుంటే ఎలా అని పవన్ కళ్యాణ్ అడిగారు.

also read: వాలంటర్లంటే వణుకు, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: పవన్ కు పేర్ని నాని కౌంటర్

 పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై  రాష్ట్ర వ్యాప్తంగా  వాలంటీర్లు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.   పవన్ కళ్యాణ్ పై  ఏపీ మంత్రులు,  వైఎస్‌ఆర్‌సీపీ నేతలు కూడ  విమర్శలు గుప్పిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థతో  చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లు భయపడుతున్నారని  ఏపీ మంత్రులు చెబుతున్నారు. అందుకే  వాలంటీర్లపై  విమర్శలు చేస్తున్నారన్నారు.వాలంటీర్లపై  పవన్ కళ్యాణ్  చేసిన వ్యాఖ్యలపై  ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.  వారం రోజుల్లో  సమాధానం ఇవ్వాలని  మహిళా కమిషన్ పవన్ కళ్యాణ్ ను కోరింది. ఈ నోటీసులపై  జనసేన  నేతలు ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు.

 


 

click me!