అమరావతి రాజధాని కేసు.. విచారణను డిసెంబర్‌కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు..

Published : Jul 11, 2023, 01:47 PM IST
అమరావతి రాజధాని కేసు.. విచారణను డిసెంబర్‌కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు..

సారాంశం

అమరావతి రాజధాని వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీం కోర్టు డిసెంబర్‌కు వాయిదా వేసింది. 

అమరావతి రాజధాని వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీం కోర్టు డిసెంబర్‌కు వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం నిర్ణయాన్ని వెలువరించింది. అమరావతి రాజధానిపై దాఖలైన పిటిషన్లపై డిసెంబర్‌లో సమగ్ర విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. అయితే దీనిపై అత్యవసరం విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది సుప్రీం ధర్మాసనాన్ని అభ్యర్థించారు. అయితే తక్షణ విచారణ సాధ్యం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే అమరావతి రాజధాని కేసు విచారణను డిసెంబర్‌కు వాయిదా వేసింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Paritala Sunitha Sensational Comments ON Thopudurthy Prakash Reddy | Asianet News Telugu
పరిటాల గడ్డపై నుండి జగన్ కు వార్నింగ్ | Nara Lokesh Fires On YS Jagan | Asianet News Telugu