చంద్రబాబు, కరువు కవలపిల్లలు: ఏపీ అసెంబ్లీలో జగన్

By narsimha lodeFirst Published Sep 21, 2022, 4:00 PM IST
Highlights

ఏపీ అసెంబ్లీలో వ్యవసాయం, అనుబంధరంగాలపై బుధవారం నాడు చర్చ జరిగింది. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను చేపట్టిందని ఏపీ సీఎం జగన్ చెప్పారు. 

అమరావతి: కరువు,చంద్రబాబు  కవలలని ఏపీ సీఎం జగన్  వ్యంగ్యాస్త్రాలు సంధించారు.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతి ఏటా కరువే ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో  బుధవారం నాడు వ్యవసాయం, అనుబంధ రంగాలపై నిర్వహించిన చర్చలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. కుప్పం నుండి ఇచ్ఛాపురం వరకు వాగులు, వంకలు నీటితో కళకళలాడుతున్నాయని సీఎం జగన్ చెప్పారు.  మూడేళ్లలో ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించలేదని సీఎం గుర్తు చేశారు. రాష్ట్రంలోని ప్రధాన నదులు పరవళ్లు తొక్కుతున్నాయన్నారు. కృష్ణా, గోదావరి డెల్టా రైతులతో పాటు రాయలసీమ రైతులకు అత్యధికంగా సాగునీరు అందిస్తున్నామన్నారు. 

ఈ మూడేళ్లలో 98.4 శాతం హమీలను అమలు చేసినట్టుగా సీఎం జగన్ తెలిపారు.రైతులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు.  ఆర్బీకేలతో వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తున్నామన్నారు. 

గత మూడేళ్లలో ఆహర ధాన్యాల ఉత్పత్తి పెరిగిందని సీఎం చెప్పారు రికార్డు స్థాయిలో పంట దిగుబడులు వచ్చాయన్నారు.సగటున 167.99 లక్షల టన్నుల దిగుబడి వచ్చిందని సీఎం వివరించారు. గతంలో కంటే సగటున 13.29 లక్షల టన్నుల దిగుబడి పెరిగిందని సీఎం తెలిపారు. 40 నెలల్లో వ్యవసాయ రంగంపై 1,28,634 కోట్లు ఖర్చు చేశామన్నారు.తమ పాలనలో రైతుల, రైతు కూలీలు కూడా సంతోషంగా ఉన్నారని సీఎం చెప్పారు. రైతు భరోసా కింద రూ. 50వేలు ఇస్తామని ప్రకటించి రూ.67, 500 ఇస్తున్నామన్నారు. రైతు భరోసా కింద 52 లక్షల 38వేల మంది రైతులకు  రూ. 23,875 కోట్లు ఇచ్చామని సీఎం వివరించారు.దేశంలో ఎక్కడా లేని విధంగా వాస్తవ సాగుదారులకే భీమా రక్షణ కల్పిస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. పంటల భీమా విషయంలో ప్రభుత్వ వాటాను  చంద్రబాబు సర్కార్ చెల్లించేదన్నారు. దీంతో  రూ. 715 కోట్లు రైతులు నష్టపోయారని సీఎం జగన్ చెప్పారు. చంద్రబాబు సర్కార్ బకాయిలు పడిన రూ. 715 కోట్లను కూడా తమ ప్రభుత్వం చెల్లించిందన్నారు.

also read:అప్పులు పెరుగుతున్నాయి: అసెంబ్లీలో కాగ్ నివేదిక ప్రవేశ పెట్టిన ఏపీ సర్కార్

రూ.87, 612 కోట్ల రుణమాఫీ చేస్తామని  చంద్రబాబునాయుడు 2014లో ఎన్నికల హామీ ఇచ్చారన్నారు. కానీ ఐదేళ్లలో రూ. 15 వేల కోట్లు మాత్రమే రుణ మాఫీ చేశారని జగన్ విమర్శించారు. పంట రుణాలు చెల్లించని కారణంగా రైతులకు భారంగా మారిందన్నారు. చంద్రబాబు పంట రుణాలను మాఫీ చేయకపోతే  రైతులపై రూ. 87,612 కోట్ల భారం పెరిగిందని వైఎస్ జగన్ విమర్శించారు.రైతులకు ఇంత మంచి చేస్తున్న విషయం చంద్రబాబుతో పాటు ఆయన వందిమాగధులకు కన్పించడం లేదన్నారు.


 

click me!