ప్రభుత్వాలు మారినప్పుడల్లా పేర్లు మార్చడం ప్రమాదకరం.. మీలాగే మేం చేసుంటే : జగన్‌పై అచ్చెన్న ఆగ్రహం

Siva Kodati |  
Published : Sep 21, 2022, 03:34 PM IST
ప్రభుత్వాలు మారినప్పుడల్లా పేర్లు మార్చడం ప్రమాదకరం.. మీలాగే మేం చేసుంటే : జగన్‌పై అచ్చెన్న ఆగ్రహం

సారాంశం

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ యూనివర్సిటీగా పేరు మార్చడాన్ని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తప్పుబట్టారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా పేర్లు మార్చుకుంటూ పోవడం ఎంత ప్రమాదకరమో జగన్ కు అర్ధం కావడం లేదని ఆయన దుయ్యబట్టారు.   

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మారుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మండిపడ్డారు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. అసెంబ్లీలో సస్పెన్షన్‌కు గురైన అనంతరం తెలుగుదేశం శాసనసభ్యులు తుళ్లూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే చేసుంటే వైఎస్సార్ పేరు, విగ్రహాలు మిగిలుండేవి కావని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా పేర్లు మార్చుకుంటూ పోవడం ఎంత ప్రమాదకరమో జగన్ కు అర్థంకావడంలేదని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో చంద్రబాబు ఎంతో విజ్ఞతతో వ్యవహరించి వైఎస్సార్ పేరు తొలగించలేదని ఆయన గుర్తుచేశారు. సీఎం జగన్ లెంపలేసుకుని ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఈ బిల్లును ఉపసంహరించుకునేంత వరకు టీడీపీ పోరాడుతుందని ఆయన తేల్చిచెప్పారు. 

అంతకుముందు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు జగన్ ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు.  వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1986లో ఈ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారని చెప్పారు. 

Also REad:డాక్టర్లు తయారయ్యే హెల్త్ యూనివర్సిటీకి ఒక రౌడీ పేరా : జగన్‌పై కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం

ఎన్టీఆర్ మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం 1998లో తమ ప్రభుత్వం హయాంలో ఈ సంస్థకు ఎన్టీఆర్ పేరు పెట్టామని గుర్తుచేశారు. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చాలని వైఎస్ఆర్ తో సహా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఆలోచన చెయ్యలేదని అన్నారు. 36 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఆలోచనలతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయానికి ఇప్పుడు ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్సార్ పేరు పెట్టడం అర్థరహితమని అన్నారు. మూడున్నరేళ్లలో కొత్తగా ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేని జగన్  ప్రభుత్వం ఉన్న వాటికే పేర్లు మార్చుతోందని విమర్శించారు. 

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి చెందిన రూ.450 కోట్ల నిధులను సైతం బలవంతంగా కాజేసిన జగన్ ప్రభుత్వం.. ఏ హక్కుతో వర్సిటీ పేరు మార్చుతుందని ప్రశ్నించారు. కనీసం స్నాతకోత్సవం నిర్వహణకు కూడా నిధులు లేకుండా చేసిన వీళ్ళు ఇప్పుడు పేరు మార్చుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్‌కు ఏం సంబంధం ఉందని చంద్రబాబు ప్రశ్నించారు. 

PREV
click me!

Recommended Stories

Minister Kondapalli Srinivas: మహిళా సంఘాల వల్లేరాష్ట్రం అభివృద్ధి: మంత్రి స్పీచ్ | Asianet Telugu
CM Chandrababu In Saras Mela At Guntur: హల్వా కి 5వేలు ఇచ్చిన చంద్రబాబు | Asianet News Telugu