మహిళల భద్రతకు పెద్దపీట: ఏపీ హోం మంత్రి వనిత

By narsimha lode  |  First Published Apr 11, 2022, 4:31 PM IST

మహిళల భద్రత తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఏపీ రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత చెప్పారు.  ఇవాళ మధ్యాహ్నం ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ కు విజన్ ఉందన్నారు.ఈ విజన్ కారణంగానే  మహిళల కోసం అనేక కార్యక్రమాలను తీసుకు వచ్చారనన్నారు.



అమరావతి:మహిళల భద్రత పట్ల సీఎం  YS Jagan  కు విజన్ ఉందని ఏపీ రాష్ట్ర హోంశాఖ మంత్రి Taneti Vanitha చెప్పారు. ఈ కారణంగానే రాష్ట్రంలో Disha యాప్ తో పాటు మహిళల భద్రత కోసం అనేక కార్యక్రమాలను తీసుకున్నారని ఆమె వివరించారు.సోమవారం నాడు మధ్యాహ్నం అమరావతిలో ఏపీ రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత మీడియాతో మాట్లాడారు.

 తనపై నమ్మకం ఉంచి తనకు Home Ministry కేటాయించినందుకు సీఎం జగన్ కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. గతంలో తాను మహిళా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన ఆమె గుర్తు చేసుకున్నారు.మహిళల భద్రత కోసం తాను తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆమె చెప్పారు. 

Latest Videos

రెండోసారి తనకు కేబినెట్ లో చోటు దక్కుతుందని తాను ఊహించలేదన్నారు. రెండోసారి కూడా కేబినెట్ లో అవకాశం కల్పించడమే కాకుండా తనకు హోం మంత్రి పదవి ఇవ్వడం తన బాధ్యతను మరింత రెట్టింపు చేసిందని ఆమె చెప్పారు. తనపై విశ్వాసం ఉంచిన సీఎం జగన్ కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. 

అంతేకాదు పార్టీని బలోపేతం చేసేందుకు తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హోంమంత్రి వనిత చెప్పారు.మహిళలు, టీనేజీ అమ్మాయిలు, విద్యార్ధినులు  ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం దిశ యాప్ తీసుకు వచ్చిందని  ఆమె గుర్తు చేశారు. దిశ చట్టానికి సంబంధించి కేంద్రం అనుమతి రావాల్సిన అవసరం ఉందన్నారు.  మహిళలు ఎక్కడ సంతోషంగా ఉంటారో ఆ రాష్ట్రం సురక్షితంగా, సుభిక్షంగా ఉంటుందన్నారు. అందుకే సీఎం జగన్ మహిళల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నారన్నారు.

2019 లో జగన్ కేబినెట్ లో మేకతోటి సుచరితకు హోంమంత్రి పదవిని కేటాయించారు. అయితే కేబినెట్ పునర్వవ్యవస్థీకరణలో సుచరితకు చోటు దక్కలేదు. అయితే గత కేబినెట్ లో 11 మందికి అవకాశం కల్పించిన తర్వాత తనకు అవకాశం ఇవ్వకపోవడంపై సుచరిత అసంతృప్తిని వ్యక్తం చేశారు. గతంలో కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళకే హోం మంత్రి పదవిని కేటాయించారు జగన్, ఈ దఫా కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు హోం మంత్రి పదవిని కేటాయించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్తీకరించారు.11 మంది పాత మంత్రులకు మరోసారి చోటు కల్పించారు. 14 మంది కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చారు. తొలుత అంబటి రాంబాబు ప్రమాణం చేశారు. చివరకు విడుదల రజ.ని మంత్రిగా ప్రమాణం చేశారు. 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్‌లో చోటు దక్కింది.  సామాజిక సమీకరణాల పరంగా చూస్తే బీసీ-10, కాపు-4, రెడ్డి-4, ఎస్సీ-5, ఎస్టీ-1, మైనార్టీ-1కి అవకాశం కల్పించారు.అయితే మంత్రివర్గంలో చోటు దక్కని కొందరు  వైసీపీ ప్రజా ప్రతినిధులు అసమ్మతి గళం విన్పిస్తున్నారు. రాజీనామాలు చేస్తామని కూడా ప్రకటించారు. మాజీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత రాజీనామా చేస్తానని ప్రకటించారు. 

click me!