AP Cabinet: ఐదుగురు డిప్యూటీ సీఎంలు.. తానేటి వనితకు హోం శాఖ.. మంత్రుల శాఖలివే..

Published : Apr 11, 2022, 03:57 PM ISTUpdated : Apr 11, 2022, 04:22 PM IST
AP Cabinet: ఐదుగురు డిప్యూటీ సీఎంలు.. తానేటి వనితకు హోం శాఖ.. మంత్రుల శాఖలివే..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రి వర్గం సోమవారం కొలువుదీరింది. అనంతరం సీఎం వైఎస్ జగన్ మంత్రులకు శాఖలు కేటాయించారు. 

ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రి వర్గం సోమవారం కొలువుదీరింది. అనంతరం సీఎం వైఎస్ జగన్ మంత్రులకు శాఖలు కేటాయించారు. గతంలో మాదిరిగా ఈసారి కూడా ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. మైనారిటీ కోటా నుంచి అంజాద్ బాషా మరోమారు డిప్యూటీ సీఎంగా అవకాశం దక్కింది. ఎస్టీ వర్గం నుంచి పీడిక రాజన్న దొర డిప్యూటీ సీఎంకు అవకాశం కల్పించారు. ఎస్సీ వర్గం నుంచి నారాయణ స్వామికి మళ్లీ డిప్యూటీ సీఎంగా కొనసాగించారు. కాపు సామాజిక వర్గం నుంచి కొట్టు సత్యనారాయణకు, బీసీల నుంచి బూడి ముత్యాల నాయుడుకు డిప్యూటీ సీఎంలుగా నియమించారు.

కీలకమైన హోం శాఖను మరోసారి దళిత మహిళకే కేటాయించారు. గతంలో బొత్స సత్యనారాయణ పురపాలక, పట్టణాభివృద్ది శాఖ బాధ్యతలు చూడగా.. ఇప్పుడు విద్యా శాఖ బాధ్యతలు అప్పగించారు. గతంలో ఆదిమూలపు సురేష్ విద్యా శాఖ నిర్వహించగా.. ఇప్పుడు ఆయనకు పురపాలక, పట్టణాభివృద్ది శాఖ బాధ్యతలు అప్పగించారు. 

డిప్యూటీ సీఎంలు..
1. అంజాద్ బాషా(మైనారిటీ)
2. పి రాజన్న దొర(ఎస్టీ)
3. బూడి ముత్యాల నాయుడు(బీసీ)
4. కె నారాయణ స్వామి(ఎస్సీ)
5. కొట్టు సత్యనారాయణ(ఓసీ-కాపు)


మంత్రుల శాఖలు.. 
1. తానేటి వనిత- హోం శాఖ, విపత్తుల నిర్వహణ
2. ధర్మాన ప్రసాదరావు- రెవెన్యూ, రిజిస్ట్రేషన్,  స్టాంపులు
3. సీదిరి అప్పలరాజు- మత్స్య, పశు సంవర్ధక శాఖ
4. బొత్స సత్యనారాయణ- విద్యా శాఖ
5. రాజన్న దొర- గిరిజన సంక్షేమ శాఖ
6. గుడివాడ అమర్‌నాథ్- ఐటీ, పరిశ్రమల శాఖ
7. బూడి ముత్యాల నాయుడు- పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది
8. దాడిశెట్టి రాజా- రోడ్లు, భవనాలు
9. పినెపి విశ్వరూప్- రవాణా శాఖ
10. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ- బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ
11. కారుమూరి నాగేశ్వరరావు- పౌర సరఫరాల శాఖ
12. కొట్టు సత్యనారాయణ- దేవదాయ శాఖ
13. జోగి రమేష్- గృహ నిర్మాణ శాఖ
14. మేరుగ నాగార్జున- సాంఘిక సంక్షేమ శాఖ
15. విడదల రజిని- వైద్యం ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య
16. అంబటి రాంబాబు-జల వనరుల శాఖ
17. ఆదిమూలపు సురేష్- పురపాలక, పట్టణాభివృద్ది శాఖ
18. కాకాణి గోవర్దన్ రెడ్డి- వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ శాఖ
19. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి-విద్యుత్, అటవీ, పర్యావరణం, మైనింగ్
20. ఆర్కే రోజా- పర్యాటక, సాంస్కృతిక, యువజన అభివృద్ది శాఖ
21. నారాయణ స్వామి- ఎక్సైజ్ శాఖ
22. అంజాద్ బాషా- మైనార్టీ సంక్షేమ శాఖ
23. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి- ఆర్థిక శాఖ, స్కిల్ డెవలప్‌మెంట్
24. గుమ్మనూరు జయరాం- కార్మిక శాఖ
25. ఉషా శ్రీ చరణ్- స్త్రీ, శిశు సంక్షేమ శాఖ

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం