
విజయవాడ: కాంగ్రెస్ పార్టీ చీఫ్ దూతగా తాను ఇక్కడికి వచ్చినట్టు కాంగ్రెన్ పార్టీ సీనియర్ నేత రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ ప్రకటించారు.
న్యూఢిల్లీ నుండి నేరుగా ఆశోక్ గెహ్లాట్ శనివారం నాడు విజయవాడకు వచ్చారు.విమానాశ్రయంలో ఆశోక్ గెహ్లాట్‌కు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డితో పాటు పలువురు నేతలు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు- రాహుల్‌తో మీటింగ్‌తో మహాకూటమి తొలి అడుగు పడిందన్నారు. రాహుల్- చంద్రబాబునాయుడు తదుపరి సమావేశాలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు తాను విజయవాడ వచ్చినట్టు గెహ్లాట్ ప్రకటించారు.
మహాకూటమి సభలు, భేటీలపై చంద్రబాబునాయుడుతో చర్చించనున్నట్టు ఆయన తెలిపారు. రాహుల్ దూతగానే ఇక్కడికి వచ్చినట్టు ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో ఉమ్మడిగా ప్రచారం చేసే విషయమై చర్చిస్తున్నామన్నారు.ఏపీలో టీడీపీతో కలిసి పనిచేసే అంశాన్ని ఆ తర్వాత చర్చిస్తామని గెహ్లాట్ ప్రకటించారు.
సంబంధిత వార్తలు
చంద్రబాబు ఇంట్లో విందు, హాజరుకానున్న రాహుల్, మమత