ఉద్యోగులతో చర్చలకు సిద్దంగా ఉన్నాం: మంత్రి బొత్స

By narsimha lodeFirst Published Jan 24, 2022, 3:17 PM IST
Highlights

పీఆర్సీ అంశంపై ఉద్యోగ సంఘాలతో చర్చలకు తాము సిద్దంగా ఉన్నామని ఏపీ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. సోమవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు


అమరావతి: ఉద్యోగులతో చర్చలకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఏపీ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.

పీఆర్సీ జీవోల విషయమై ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ కమిటీని ఏర్పాటు చేశారు.ఈ కమిటీలో Botsa Satyanarayana, పేర్ని నాని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఏపీ రాష్ట్ర  ప్రభుత్వ సలహాదారు Sajjala Ramakrishna Reddy, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి Sameer Sharma లు సభ్యులుగా ఉన్నారు.

సోమవారం నాడు సచివాలయంలో ఈ కమిటీ సమావేశమైంది. ఉద్యోగుల డిమాండ్ల విషయమై చర్చించింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత ఏపీ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి Botsa Satyanarayana సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.

జీఏడీ సెక్రటరీ ఉద్యోగ సంఘాల నేతలకు ఫోన్లు చేసి చర్చలకు పిలిచిన తర్వాత కూడా అనధికార చర్చలు ఎలా అవుతాయని మంత్రి సత్యనారాయణ ప్రశ్నించారు. కరోనా పరిస్థితులు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను బట్టి ఉద్యోగులు కూడా అర్ధం చేసుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు.

 ఉద్యోగులను చర్చలకు పిలిచినట్టుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు Sajjala RamaKrishna Reddy చెప్పారు. ఉద్యోగులు చర్చలకు రాకపోవడం సరైంది కాదన్నారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ప్రభుత్వం నియమించిన కమిటీతో చర్చలు జరపబోమని ఉద్యోగ సంఘాలు చెప్పడం సమస్యను మరింత జఠిలం చేయడమేనని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. 

ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగులు  కూడా పరిస్థితులను అర్ధం చేసకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. రేపు కూడా చర్చలకు రమ్మని పిలుస్తామన్నారు. PRC పై అనుమానాలుంటే ప్రభుత్వం నియమించిన కమిటీని అడగవచ్చన్నారు. ఉద్యోగుల ప్రతినిధులు చర్చలకు వస్తారని భావిస్తున్నామన్నారు. చర్చలకు ఉద్యోగ సంఘాలు రాలేదని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల నేతలు ఈ నెల 7వ తేదీన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 23.29 శాతం పీఆర్సీ ఫిట్‌మెంట్ ఇస్తామని సీఎం   YS Jagan హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెండింగ్ లోని ఐదు D.A లను ఒకే సారి ఇస్తామని హమీ ఇచ్చారు. ఫిట్‌మెంట్ కనీసం 27 శాతానికి తగ్గకుండా ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే పెండింగ్ డిఏలు ఒకేసారి ఇస్తామని హమీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి.

ఈ భేటీ తర్వాత Hraవిషయమై Chief Secretary నేతృత్వంలోని కమిటీతో ఉద్యోగ సంఘాలు సంక్రాంతి పర్వదినం కంటే ముందే పలు దఫాలు భేటీ అయ్యారు. కానీ ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల డిమాండ్ పై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు.  అయితే ఈ నెల 17వ తేదీ రాత్రి పీఆర్సీపై  ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఈ జీవోల్లో హెచ్ఆర్‌ఏను భారీగా తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. 30 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏ స్థానంలో 16 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వడంతో తాము 14 శాతం నష్టపోతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.

మరో వైపు ఉేద్యోగ సంఘాలు సమ్మె కు వెళ్లాలని భావిస్తున్నాయి. ఈ విషయమై  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసును కూడా ఇవ్వనున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎస్ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ ట్రాప్ లో పడుతున్నారని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవోలతో తమకు వేతనాలు తగ్గిపోతాయని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. అయితే ఈ వాదనతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ విబేధిస్తున్నారు.

కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం 98 వేల కోట్ల నుండి 62 వేల కోట్లకు పడిపోయిందన్నారు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో పరిస్థితులు ఇంకా దారుణంగా ఉండే అవకాశం ఉందని కూడా సీఎస్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నష్టం కలగకుండా ఉండేలా జీవోలు జారీ చేశామన్నారు. 

click me!