యర్రగొండపాలెంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం.. రిక్షా తొక్కిన మంత్రి ఆదిమూలపు సురేష్

By Rajesh KFirst Published Jan 24, 2022, 3:05 PM IST
Highlights

Minister Adimulapu Suresh:  జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలానికి మంజూరైన 43 చెత్త సేకరణ రిక్షాలను పారిశుద్ధ్య కార్మికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రిక్షాను తొక్కి కార్మికులను ప్రోత్సాహించారు. 
 

Minister Adimulapu Suresh:  కరోనా మహమ్మారి ప్రజలను అతలాకుతలం చేసిందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించారని కొనియాడారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలానికి మంజూరైన 43 చెత్త సేకరణ రిక్షాలను పారిశుద్ధ్య కార్మికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రిక్షాను తొక్కి కార్మికులను ప్రోత్సాహించారు. 

కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించారని మంత్రి అదిములపు సురేష్ తెలిపారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.ఈ కార్య‌క్ర‌మంలో పారిశుద్ధ్య కార్మికులను  సన్మానించారు.
జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా మండలానికి మంజూరైన 43 చెత్త సేకరణ రిక్షాలను పారిశుద్ధ్య కార్మికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రిక్షాను తొక్కి కార్మికులను ప్రోత్సాహించారు. 
గురిజేపల్లి , యర్రగొండపాలెం , కాశికుంటా తండాలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాలను, యర్రగొండపాలెంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాన్ని ప్రారంభించారు.

గ్రామీణ, పట్టణ, నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించే ల‌క్ష్యంగా ‘క్లీన్‌ ఆంద్రప్రదేశ్‌ (క్లాప్‌)–జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలు ఆరోగ్యకరమైన పరిసరాల్లో ఆహ్లాదంగా గడపాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం​. క్లాప్‌కార్యక్రమంలో భాగంగా బిన్‌ ఫ్రీ, లిటర్‌ ఫ్రీ, గార్బేజ్‌ ఫ్రీ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే జాతీయస్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీల్లో ఉత్తమ ర్యాంక్‌ సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 100 రోజులపాటు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం కొనసాగనుంది. 

ఇదిలా ఉంటే.. ఏపీలో క‌రోనా కేసులు విజృంభిస్తున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 46, 650 శాంపిల్స్ పరీక్షించగా 14,440 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఇందులో అత్య‌ధికంగా.. విశాఖ జిల్లాలో 2258 కేసులు న‌మోదు కాగా..  చిత్తూరు జిల్లాలో 1198 కేసులు, అనంతపురం జిల్లాలో 1534 కేసులు, గుంటూరు జిల్లాలో 1458 కేసులు, ప్రకాశం జిల్లాలో 1399 కేసులు న‌మోద‌న‌ట్టు ఆర్యోగ నిపుణులు వెల్లడించారు. ఇతర జిల్లాల్లోనూ అదే స్థాయిలో కొత్త కేసులు గుర్తించారు.

click me!