ట్రిపుల్ తలాక్ బిల్లు: వ్యతిరేకించిన వైఎస్ఆర్‌సీపీ

By narsimha lodeFirst Published Jul 30, 2019, 3:30 PM IST
Highlights

ట్రిపుల్ తలాక్ బిల్లుపై   వైఎస్ఆర్ సీపీ తన వైఖరిని స్పష్టం చేసింది. ఈ బిల్లుపై తమ అభ్యంతరాలను ఆ పార్టీ స్పష్టం చేసింది.


న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్టు  వైఎస్ఆర్‌సీపీ రాజ్యసభలో ప్రకటించింది.  ట్రిపుల్ తలాక్ బిల్లుపై మంగళవారం నాడు రాజ్యసభలో  చర్చ జరిగింది. అధికార పార్టీకి వ్యతిరేకంగా విపక్ష నేతలు విమర్శలు గుప్పించారు.

ట్రిపుల్ తలాక్ బిల్లుపై  రాజ్యసభలో మంగళవారం నాడు జరిగిన చర్చలో వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పక్ష నేత విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. 

భర్తను జైల్లో పెడితే భార్యకు మనోవర్తి ఎలా చెల్లిస్తారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ముస్లిం వివాహం సివిల్ కాంట్రాక్ట్.. దీనిపై క్రిమినల్ చర్యలు ఎలా తీసుకొంటారని  ఆయన ప్రశ్నించారు. 

కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ బిల్లులోని ఆరు అంశాలపై తమ కు అభ్యంతరాలు ఉన్నాయని విజయసాయిరెడ్డి ప్రకటించారు. చట్టంలో లేని అంశాల ఆధారంగా కఠిన శిక్షలను ఎలా విధిస్తారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. 

 

సంబంధిత వార్తలు

 

రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు: కేసీఆర్, జగన్ ఏం చేస్తారు?

click me!