శాసనమండలిలో బుధవారం నాడు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
అమరావతి: పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని శాసనమండలి ఛైర్మెన్ పోడియం వద్ద బుధవారం నాడు సాయంత్రం టెన్షన్ వాతావరణం నెలకొంది.
also read:శాసనమండలిలో ముగిసిన చర్చ: సెలెక్ట్ కమిటీకి టీడీపీ పట్టు, వద్దన్న వైసీపీ
సెలెక్ట్ కమిటీకి ఈ రెండు బిల్లులను పంపాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ఛైర్మెన్ పోడియం వద్ద టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు, మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది.
also read: ఏపీ శాసనమండలి: అంగుళం భూమి లేదు, చేతులు జోడించి వేడుకొన్న లోకేష్
Also read:మొబైల్ చూసి నారా లోకేష్ లెక్కలు: తప్పు పట్టిన బొత్స, బుగ్గన అభ్యంతరం
మంత్రి కొడాలి నాని టీడీపీ ఎమ్మెల్సీల వైపు దూసుకు వచ్చారు. ఈ సమయంలో టీడీపీ ఎమ్మెల్సీలు కూడ మంత్రి వైపుకు దూసుకువచ్చారు. మంత్రులు రంగనాథ రాజు, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు మంత్రిని వారించారు. ఇదే సమయంలో టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ టీడీపీ ఎమ్మెల్సీలను వెనక్కి పంపారు.
Also read:ఏపీ అసెంబ్లీ: టీడీపీ సభ్యుల తీరుపై ఎథిక్స్ కమిటీకి స్పీకర్ సిఫారసు
Also read:బట్టలు విప్పేసి తిరుగుతానంటే ఏం చేయలేం: జేసీ సెటైర్లు
Also read:ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హతకు టీడీపీ నోటీసులు: ఎవరీ పోతుల సునీత
Also read:మండలిలో జగన్‌కు షాక్: ఆ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ నోటీసు
ఇదే సమయంలో టీడీపీ చీఫ్ , మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలతో కలిసి మండలి గ్యాలరీకి చేరుకొన్నారు. ఈ విషయమై మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మండలి ఛైర్మెన్ షరీఫ్‌కు చంద్రబాబు గ్యాలరీకి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో మండలిని 10 నిమిషాల పాటు మండలి ఛైర్మెన్ షరీఫ్ వాయిదా వేశారు.