దళిత మహిళా సర్పంచిపై వైసీపీ నేతల అసభ్య ప్రవర్తన.. చంపేస్తామని బెదిరింపు..

Published : Jun 14, 2022, 06:44 AM IST
దళిత మహిళా సర్పంచిపై వైసీపీ నేతల అసభ్య ప్రవర్తన.. చంపేస్తామని బెదిరింపు..

సారాంశం

గుంటూరులో అక్రమ మట్టి తవ్వకాన్ని ప్రశ్నించినందుకు ఓ దళిత మహిళా సర్పంచ్ మీద వైసీపీ నాయకులు విరుచుకుపడ్డారు. ఆమె కొడుకును చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. 

గుంటూరు : అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం వంగిపురం గ్రామ దళిత మహిళా సర్పంచ్ శిఖా విజయలక్ష్మి పట్ల వైసిపి నాయకులు అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె భర్త యాకోబు, కుమారుడు నవీన్ ను చంపేస్తామని బెదిరించారు. ఎస్ఐ ప్రతాప్ కుమార్ కథనం ప్రకారం.. ఆదివారం సాయంత్రం గ్రామ శివారులోని చెరువులో అక్రమంగా మట్టి తగ్గుతున్నట్లు సర్పంచ్ కి సమాచారం వచ్చింది. ఆమె తన భర్త, కుమారుడితో చెరువు వద్దకు వెళ్లి దీనిపై ప్రశ్నించారు.

వైసిపి నాయకులు మాచర్ల మధు, సురేష్ వారిని దుర్భాషలాడటంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తించారు. మరో వైసీపీ నాయకుడు  మాచర్ల ఏసోబు సర్పంచ్ కుమారుడిని చంపేయాలని మిగిలినవారిని ఉసిగొలిపాడు. ‘నా వైపు  ఎమ్మెల్యే ఉన్నారు. మీకు దిక్కున్నచోట చెప్పుకోండి’ అని  బెదిరించాడని  ఆదివారం రాత్రి సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్ధరాత్రి కేసు నమోదైంది.

టిడిపి కార్యాలయంలో తలదాచుకున్న సర్పంచ్..
గుంటూరులోని టిడిపి కార్యాలయంలో సర్పంచ్ విజయలక్ష్మి, భర్త యాకోబు, కుమారుడు నవీన్  తలదాచుకున్నారు. ఆదివారం రాత్రి  పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు భయపడిన వారు టిడిపి జిల్లా నాయకులకు సమాచారం అందించారు. అర్ధరాత్రి గుంటూరుకు చేరుకుని పార్టీ కార్యాలయంలోనే ఉన్నారు.

వైసీపీ నేతలను నిలదీసిన వెంకాయమ్మ, ఆమె కుమారుడిపై దాడి.. డీజీపీకి చంద్రబాబు ఫిర్యాదు

ఇదిలా ఉండగా, గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామంలోనూ ఇలాంటి గొడవే రాష్ట్రంలో ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ గ్రామానికి చెందిన టిడిపి అభిమాని వెంకాయమ్మ కుటుంబంపై అదే గ్రామానికి చెందిన కొందరు దాడికి యత్నించారు. అయితే ఇది వైసీపీ నాయకులు చేయించిన పని అంటూ వెంకాయమ్మకు టిడిపి అండగా నిలిచింది. గతంలో వైసిపి నాయకులను నిలదీసినందుకే ఆమె  కుటుంబంపై కక్షగట్టి ఇలా దాడులకు దిగుతున్నట్లు టిడిపి ఆరోపిస్తోంది. వెంకాయమ్మకు మద్దతుగా తాడికొండ పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, ఇతర టీడీపీ నాయకులపై పోలీసులు, వైసీపీ శ్రేణులు దాడికి ప్రయత్నించాయి. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

ఈ దాడులను ఖండిస్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు "ఛలో కంతేరు" టిడిపి శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా కంతేరులో భారీగా పోలీసు బలగాలను మోహరించిన పోలీసులు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. కంతేరు గ్రామానికి  వెళ్లడానికి సిద్ధమైన మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, దేవినేని ఉమామహేశ్వరరావులను ముందస్తుగానే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కంతేరుకు వెళుతున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్, ఇతర నాయకులను తాడేపల్లి పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

అయితే, ఒటీవల గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వైసీపీ నేతలను నిలదీసిన దళిత మహిళ వెంకాయమ్మను చంపాలని అధికార వైసీపి నాయకులు కుట్చంరలు పన్పానారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి  అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ఆరోపించారు. నిన్న తాడికొండ పోలీస్ స్టేషన్ వద్ద చోటు చేసుకున్న సంఘటనలు, ఆ తరువాత పోలీసుల  తీరును చూస్తుంటే వెంకాయమ్మతో పాటు ఆమె కొడుకును హతమార్చడానికి వైసీపీ రౌడీలు, పోలీసులు పక్కా వ్యూహం రచించినట్లు అర్థమౌతుందని మాణిక్యరావు సంచలన వ్యాఖ్యలు చేసారు. 

 

 

 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!