కరోనా లక్షణాలు... పరీక్షా కేంద్రంలోనే కుప్పకూలి వీఆర్ఓ మృతి (వీడియో)

By Arun Kumar PFirst Published Sep 4, 2020, 7:47 PM IST
Highlights

కరోనా లక్షణాలతో బాధపడుతూ నిర్ధారణ పరీక్షలు చేయించుకోడానికి వెళ్లిన ఓ వీఆర్ఓ పరీక్షలు నిర్వహించే కేంద్రంలోనే మృత్యువాతపడిన విషాదం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

అమరావతి: కరోనా లక్షణాలతో బాధపడుతూ నిర్ధారణ పరీక్షలు చేయించుకోడానికి వెళ్లిన ఓ వీఆర్ఓ పరీక్షలు నిర్వహించే కేంద్రంలోనే మృతిచెందిన విషాదం గుంటూరు జిల్లా ఐనవోలులో చోటుచేసుకుంది. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే అతడు మృతిచెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. 

ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రాజధాని గ్రామం రాయపూడి గ్రామానికి చెందిన అనిల్ లింగాపురం విఆర్ఓ గా పనిచేస్తున్నాడు. ఈ మధ్య ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో అతడు కరోనా పరీక్షల కోసం ఐనవోలు గ్రామంలోని కోవిడ్ పరీక్షా కేంద్రానికి వెళ్లాడు. అయితే అతడు పరీక్షా కేంద్రంలో వుండగానే శ్వాస సమస్య మరీ ఎక్కువ కావడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృత్యువాతపడ్డాడు. 

వీడియో

"

అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన తండ్రి చనిపోయినట్లు మృతుని కుమారుడు క్రాంతి ఆరోపిస్తున్నాడు. తీవ్రమైన శ్వాస సమస్యతో బాధపడుతున్నా లంచ్ టైం కావడంతో వేచివుండాలని చెప్పి పరీక్ష చేసే సిబ్బంది వెళ్లిపోయారని...తాత్కాలిక ఉపశమనం కోసం టాబ్లెట్ ఇవ్వమని కోరిన వారు స్పందించలేదని ఆరోపించాడు. దీంతో తన తండ్రి కొద్దిసేపు కొనఊపిరితో కొట్టుమిట్టాడి మృతి చెందాడని... చనిపోయిన గంట తర్వాత తాపీగా వచ్చిన వైద్య  అధికారి పరీక్షలు చేయడానికి వచ్చారన్నాడు. ఇలా వైద్యుల నిర్లక్ష్యం వల్లే అనిల్ మృతి చెందాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేశాడు. 
 

click me!