ఏపీలో కొత్తగా 10,776 మందికి పాజిటివ్, 76 మరణాలు: 4,76,506కి చేరిన కేసులు

Siva Kodati |  
Published : Sep 04, 2020, 07:29 PM ISTUpdated : Sep 04, 2020, 07:36 PM IST
ఏపీలో కొత్తగా 10,776 మందికి పాజిటివ్, 76 మరణాలు: 4,76,506కి చేరిన కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా తొమ్మిదో రోజు 10వేలకు పైగా కరోనా కేసులు వెలుగుచూశాయి. గడిచిన 24 గంటల్లో 10,776 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా తొమ్మిదో రోజు 10వేలకు పైగా కరోనా కేసులు వెలుగుచూశాయి. గడిచిన 24 గంటల్లో 10,776 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

దీంతో కలిపి ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,76,506 కి చేరింది. అలాగే నిన్న ఒక్కరోజే కోవిడ్ కారణంగా 76 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,276కి చేరుకుంది.

గత 24 గంటల్లో 59,919 మంది శాంపిల్స్ పరీక్షించడంతో ఇప్పటి వరకు టెస్టుల సంఖ్య 39,65,694కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 1,02,067 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న ఒక్క రోజే 12,334 మంది కోవిడ్ నుంచి కోలుకోవడం విశేషం.

దీంతో ఏపీలో మొత్తం రికవరీల సంఖ్య 3,70,163కి చేరింది. గడిచిన 24 గంటల్లో అనంతపురం 750, చిత్తూరు 970, తూర్పు గోదావరి 1405, గుంటూరు 708, కడప 727, కృష్ణా 378, కర్నూలు 702, నెల్లూరు 1,270, ప్రకాశం 1,256, శ్రీకాకుళం 538, విశాఖపట్నం 560, విజయనగరం 588, పశ్చిమ గోదావరిలలో 924 కేసులు నమోదయ్యాయి.

అలాగే కరోనా కారణంగా చిత్తూరు 9, ప్రకాశం 9, గుంటూరు 8, కడప 8, నెల్లూరు 8, తూర్పుగోదావరి 6, విశాఖపట్నం 6, పశ్చిమ గోదావరి 6, కృష్ణ 5, శ్రీకాకుళం 4, అనంతపురం 3, కర్నూలు 2, విజయనగరంలలో ఇద్దరు చొప్పున మరణించారు. 

 

 

PREV
click me!

Recommended Stories

స్థానిక ఎన్నికల పోరుకు సిద్ధం పూనకాలు తెపించే జగన్ స్పీచ్ | Asianet News Telugu
Jogi Ramesh vs Meghana | బైబిల్ చదివితే తప్పా.. పూజ చేయాలన్న భయమేసేది | Controversy