చంపినవాళ్ల దగ్గరికి వెళ్లి పరామర్శించడం ఎక్కడైనా ఉందా?.. పందికొక్కులు, ఎలుకలు అన్నీ ఏకమైనా సరే..: సజ్జల

By Sumanth KanukulaFirst Published Jan 9, 2023, 2:02 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పవన్, చంద్రబాబు కలయికకు అటెన్షన్‌ను క్రియేట్ చేసుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పవన్, చంద్రబాబు కలయికకు అటెన్షన్‌ను క్రియేట్ చేసుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అక్రమం సక్రమని.. వారిది పవిత్ర కలయిక చెప్పడానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ తాపత్రయపడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు కారణంగా 11 మంది చనిపోయారని.. చంపినవాళ్ల దగ్గరికి వెళ్లి పరామర్శించడం ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌ ముందు చనిపోయిన వాళ్లను పరామర్శించాలని అన్నారు. 

టీడీపీ, జనసేన కలయికను వామపక్షాలు స్వాగతించడం విచిత్రంగా ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ, జనసేన కలిసి బీజేపీని కలుపుకుంటారని అంటున్నారని.. అలాగైతే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఏం మాట్లాడతాయని ప్రశ్నించారు. ఎరుపు, కాషాయం కలిసి పసుపుగా మారుతుందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఎంత మందిని కలుపుకున్నా.. ఒక విధంగా మంచిదేనని అన్నారు. ఎవరూ ఏ విలువల మీద ఉంటున్నారో తెలుందని చెప్పుకొచ్చారు. గుంటనక్కలు, పందికొక్కులు, ఎలుకలు అన్నీ ఏకమై కలిసివచ్చిన సరే.. ప్రజాబలం ఉన్న జగన్‌ విజయాన్ని ఆపలేరని అన్నారు. అందరినీ ఒకేసారి ఓడించే అవకాశం సీఎం జగన్‌కు వస్తుందన్నారు. 

ముందస్తుకు వెళ్లే ఉద్దేశం తమకు లేదన్నారు. ప్రజా తీర్పు ప్రకారం సీఎం జగన్ ఐదేళ్లు పూర్తిగా పరిపాలిస్తామని చెప్పారు. సజీవంగా ఉన్నామని చెప్పడానికే ప్రతిపక్షాలు ముందస్తు మాటలు మాట్లాడుతున్నాయని విమర్శించారు.

click me!