చంద్రబాబు డైరెక్షన్ లో జనసేనాని:పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్

Published : Jan 09, 2023, 02:28 PM IST
 చంద్రబాబు డైరెక్షన్ లో జనసేనాని:పవన్ కళ్యాణ్ పై  వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్

సారాంశం

చంద్రబాబు డైరెక్షన్ లోనే  పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడని  రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు.

తిరుపతి:  చంద్రబాబు డైరెక్షన్ లో  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  పనిచేస్తున్నాడని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి  చెప్పారు.సోమవారం నాడు  ఆయన చిత్తూరు జిల్లాలో మీడియాతో మాట్లాడారు.కొంత కాలంగా  పవన్ కళ్యాణ్   చంద్రబాబుకు  అనుకూలంగా చేస్తున్న వ్యాఖ్యలను కూడా  ఆయన గుర్తు చేశారు.  కుప్పంలో  టీడీపీ కార్యకర్తలు దొంగకట్లు కట్టుకుని ఆసుపత్రిలో చేరారన్నారు.  ఫోటోలు తీసుకున్న తర్వాత  ఎవరి ఇళ్లకు  వారు వెళ్లినట్టుగా  ఆయన  చెప్పారు.  రాష్ట్రంలో శాంతి భద్రతలు  సరిగా  లేకపోతే  చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్  రాష్ట్రంలో  స్వేచ్ఛగా తిరిగేవారా  అని ఆయన ప్రశ్నించారు. 

టీడీపీ అధినేత  చంద్రబాబుతో  జనసేన అధ్యక్షుడు  పవన్ కళ్యాణ్ నిన్న సమావేశమయ్యారు.  గత వారంలో  చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనకు వెళ్లారు. కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబునాయుడును పోలీసులు అడ్డుకున్నారు.  జీవో నెంబర్  1 ప్రకారంగా   రోడ్ షో లు,  సభలు,ర్యాలీలకు అనుమతి లేదని  పోలీసులు తేల్చి చెప్పారు. ఈ విషయమై  పోలీసుల తీరుపై  చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం  చేశారు. కుప్పంలో  చంద్రబాబునాయుడు పర్యటననను అడ్డుకోవడంపై  పవన్ కళ్యాణ్  చర్చించారు.  
గత ఏడాది అక్టోబర్  మాసంలో  పవన్ కళ్యాణ్ విశాఖపట్టణంలో జనవాణి కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. అయితే  జనవాణిని కార్యక్రమానికి ఆ సమయంలో పోలీసులు అనుమతివ్వలేదు. ఆనాడు నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో  జనవాణికి అనుమతివ్వలేమని పోలీసులు  ప్రకటించారు. దీంతో  పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమం నిర్వహించకుండానే విజయవాడకు తిరిగి వచ్చారు. విశాఖలో పవన్ కళ్యాణ్  ను  అడ్డుకోవడాన్ని  టీడీపీ తప్పుబట్టింది. గత ఏడాది అక్టోబర్  మాసంలో  విజయవాడలో  పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు పరామర్శించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన  జీవో నెంబర్  1పై  చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు  చర్చించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్