Train Accident: విజయనగరం రైలు ప్రమాద బాధితులను పరామర్శించిన సీఎం జగన్.. ఆదుకుంటామ‌ని హామీ

By Mahesh Rajamoni  |  First Published Oct 31, 2023, 12:41 AM IST

Vizianagaram Train Accident: విజయనగరం జిల్లా కంతకపల్లి వద్ద ఆదివారం చోటుచేసుకున్న రైలు ప్రమాద బాధితుల‌ను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌రామ‌ర్శించారు. రాయగ‌ఢ్ ప్యాసింజర్ రైలు నెమ్మదిగా వెళ్తున్న పలాస ప్యాసింజర్ రైలును ఢీకొనడంతో గార్డు బోగీలు కూలడంతో పాటు రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టివ‌ర‌కు 15 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మంది క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
 


AP Chief Minister YS Jagan Mohan Reddy: విజయనగరం జిల్లా కంతకపల్లి వద్ద ఆదివారం చోటుచేసుకున్న రైలు ప్రమాద బాధితుల‌ను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌రామ‌ర్శించారు. రాయగ‌ఢ్ ప్యాసింజర్ రైలు నెమ్మదిగా వెళ్తున్న పలాస ప్యాసింజర్ రైలును ఢీకొనడంతో గార్డు బోగీలు కూలడంతో పాటు రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టివ‌ర‌కు 15 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మంది క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ముఖ్య‌మంత్రి పర్యటన కారణంగా ఆలస్యమయ్యే ట్రాక్ పునరుద్ధరణ పనుల కోసం ప్రమాదానికి గురైన బోగీలను తొలగించే పనిలో అధికారులు ఉన్నందున తొలుత సంఘటనా స్థలాన్ని పరిశీలించకుండా నేరుగా రైల్వే అధికారుల అభ్యర్థన మేరకు బాధితులను సీఎం జ‌గ‌న్ పరామర్శించారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న సీఎం జగన్ అక్కడి నుంచి హెలికాప్టర్ లో పోలీస్ ట్రైనింగ్ కాలేజీ మైదానంలోని హెలిప్యాడ్ కు వెళ్లారు. అక్కడి నుంచి విజయనగరం ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితులను పరామర్శించారు.

Latest Videos

undefined

విజయనగరం జిల్లా కంతకపల్లి వద్ద ఆదివారం రైలు ప్రమాదం జరిగింది. రాయగడ ప్యాసింజర్ రైలు నెమ్మదిగా వెళ్తున్న పలాస ప్యాసింజర్ రైలును ఢీకొనడంతో గార్డు బోగీలు కూలడంతో పాటు రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టివ‌ర‌కు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 50 మంది గాయ‌ప‌డ్డారు. అయితే, రెండు రైళ్లు ఢీకొన్న ఈ ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఉన్నత స్థాయి ఆడిట్ కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. 

ఎక్స్ పోస్టులో.. "విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరం. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో గాయపడి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను. వారు కోలుకునేంతవరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. వారికి మంచి వైద్యం అందించ‌డంతో పాటు మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియాను సత్వరమే అందించాలని అధికారులను ఆదేశించాను" అని పేర్కొన్నారు. 

భవిష్యత్తులో ఇలాంటి విధ్వంసకర ప్రమాదాలు పునరావృతం కాకుండా చూసేందుకు కేవలం ఈ లైన్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని మార్గాల్లో ఈ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఉన్నత స్థాయి ఆడిట్ కమిటీని ఏర్పాటు చేయాలని మోడీని, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను అభ్యర్థించారు. బాధితుల‌తో మాట్లాడిన త‌ర్వాత‌.. క్షతగాత్రులు పూర్తిగా కోలుకున్నాకే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులతో మాట్లాడిన అనంతరం ముఖ్యమంత్రి ముందుగా ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాలో మార్పులు చేశారు. ప్రమాదంలో మరణించిన వారి బంధువులకు, శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని అధికారులను ఆదేశించారు.

click me!