చంద్రబాబుపై ఏపీ సీఐడీ అధికారులు మరో కేసు నమోదు చేశారు.
టీడీపీ చీఫ్ చంద్రబాబుపై మరో కేసు నమోదైంది. ఈ మేరకు ఏపీ సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో సోమవారంనాడు పిటిషన్ దాఖలు చేశారు. సీఎంగా ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారనే కారణంగా చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేసింది.ఈ విషయమై ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ అధికారులు ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ సీఐడీ పిటిషన్ ను ఏసీబీ కోర్టు అనుమతించింది.
ఏ 1 గా నరేష్, ఏ 2 గా కొల్లు రవీంద్ర, ఏ 3 గా చంద్రబాబు పేరును చేర్చారు. నిబంధనలకు విరుద్దంగా మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారని అభియోగాలు నమోదు చేసింది.పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టుగా ఏపీ సీఐడీ అధికారులు పేర్కొన్నారు.
undefined
మద్యం కంపెనీలకు అనుమతులు ఇచ్చే అంశంలో అక్రమాలకు పాల్పడ్డారని ఇచ్చిన పిర్యాదులో కీలక అంశాలను ఏపీబీపీసీఎల్ ఎండీ ప్రస్తావించారు.రెండు బ్రేవరేజ్ లు , మూడు డిస్టిలరీలు లబ్ది చేకూర్చడానికి మద్యం పాలసీనే మార్చేశారని ఆరోపించారు.
నంద్యాల మాజీ ఎంపి ఎస్పివై రెడ్డి కి చెందిన బ్రేవరేజ్ తో పాటు ఒక బ్రేవరేజ్, మూడు డిస్టిలరీలకి లబ్ది చేకూర్చేలా వ్యవహరించారన్నారు.ఐదు మద్యం బ్రేవరేజ్ లకు, డిస్టిలరీలకి అనుకూలంగా 2012 ఎక్సైజ్ పాలసీని మార్చి అనుమతి ఇచ్చారని ఏపీబీపీసీఎల్ ఎండీ పేర్కొంది.
2015 లో కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకువచ్చి ప్రభుత్వానికి పన్నులు రాకుండా చేశారని అభియోగాలు ఏపీబీపీసీఎల్ ఎండీ ఆరోపించారు. టర్నోవర్ పై 8 శాతం వ్యాట్ కాకుండా అదనంగా 6 శాతం పన్నులు తీసివేశారని ఏపీబీపీసీఎల్ ఎండీ సీఐడీకి ఫిర్యాదు చేసింది. 6 శాతం నుంచి పది శాతానికి పన్నులు పెంచాలని చేసిన కమిటీ సిఫార్సులు బేఖాతరు చేశారని బ్రేవరేజేస్ సంస్థ ఆరోపించింది. రెండు బ్రేవరేజ్ లు, మూడు డిస్టలరీలకి లబ్ది చేకూర్చడానికి క్విడ్ ప్రో కి పాల్పడ్డారని సీఐడీ పేర్కొంది.
ఇప్పటికే ఏపీ ఫైబర్ నెట్ కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసు, అంగళ్లు కేసుల్లో చంద్రబాబు పేరును ఏపీ సీఐడీ చేర్చిన విషయం తెలిసిందే . ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ఈ ఏడాది సెప్టెంబర్ 9న చంద్రబాబును ఈ కేసులో అరెస్ట్ చేశారు.
వరుస కేసులతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు జ్యుడీషీయిరల్ రిమాండ్ లో ఉన్నారు.ఈ సమయంలోనే ఇతర కేసుల్లో బాబుపై పీటీ వారంట్లను ఏపీ సీఐడీ అధికారులు కోర్టుల్లో దాఖలు చేశారు. ఏపీ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టు ఆమోదం తెలిపింది.అయితే ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నవంబర్ 9న సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది.
also read:ఏపీ స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ కోసం బాబు పిటిషన్: తీర్పు రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
మరో వైపు ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ ఈ ఏడాది నవంబర్ 8న విచారణకు రానుంది.ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. ఇవాళ ఇరు వర్గాల వాదనలను ఏపీ హైకోర్టు విన్నది. తీర్పును రిజర్వ్ చేసింది.