వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ: ప్లాంట్ ఎదుట కార్మిక సంఘాల నిరసన

By narsimha lodeFirst Published Jul 8, 2021, 10:33 AM IST
Highlights

విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ గురువారం నాడు ఉదయం కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.   స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని  కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.  
 

విశాఖపట్టణం: విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ గురువారం నాడు ఉదయం కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.   స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని  కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.  స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంలో భాగంగా  లీగల్ అడ్వైజర్,  ను కేంద్రం నియమించినట్టుగా సమాచారం.  

కార్మికులు, ఉద్యోగులు ఆందోళనలు నిర్వహిస్తున్నా కూడ  ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రైవేటీకరణకే  మొగ్గుచూపడంపై కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. ప్రైవేటీకరణ నిరణయాన్ని నిరసిస్తూ  కార్మిక సంఘాలు దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే.  విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకొనేవరకు తాము పోరాటాన్ని కొనసాగిస్తామని కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. 

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమయంలో ఎలాంటి చిక్కులు రాకుండా ఉండేందుకు గాను  ప్రభుత్వం అడ్వైజర్లను నియమించుకొంటుంది.  స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడ ప్రధాని మోడీకి లేఖ రాశారు.విపక్షాలు కూడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాయి. కానీ కేంద్ర మాత్రం మెనక్కు తగ్గడం లేదు.   
 

 


 

click me!