కాకినాడలో స్ట్రీట్ ఫైట్... ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Jul 08, 2021, 09:57 AM ISTUpdated : Jul 08, 2021, 10:19 AM IST
కాకినాడలో స్ట్రీట్ ఫైట్... ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం (వీడియో)

సారాంశం

ఘటన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జగన్నాధపురం ఘాటీ సెంటర్ వద్ద ఇరువర్గాల మధ్య జరిగిన గొడవ ఒకరి ప్రాణాలను బలితీసుకుంది.   

కాకినాడ: ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న గొడవ ఒకరి ప్రాణాలను బలితీసుకోవడమే కాదు మరొకరిని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జగన్నాధపురం ఘాటీ సెంటర్ వద్ద చోటుచేసుకుంది.  

జగన్నాధపురంలో ఎస్సీ పేటకు చెందిన అంజిబాబుకు అగ్నికుల క్షత్రియ వర్గానికి చెందిన కొల్లు నాగుర్ కు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. తాజాగా వీరి మధ్య గొడవ జరగ్గా తీవ్రంగా గాయపడి  అంజిబాబు(30) హాస్పిటల్ లో చికిత్ప పొందుతూ మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన మరొకరు పరిస్థితి విషమంగా ఉంది. అతడు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

read more  అత్యాచారం చేస్తూ ఫోటోలు, వీడియోలు... మూడుసార్లు గర్భవతిని చేసి అబార్షన్

అంజిబాబు మృతితో హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. 

వీడియో

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్